అక్షరటుడే, ఇందూరు: BC Caste Census | దేశవ్యాప్తంగా చేపట్టబోయే జాతీయ జనగణలో(national census) బీసీ కులగణన(BC caste census) కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. నగరంలోని(Nizamabad City) పులాంగ్ చౌరస్తాలో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
BC Caste Census | కులగణన చేస్తామని చెప్పి..
ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం బీసీలకు కులగణన చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని.. కానీ ప్రస్తుతం కులగణన లేకుండా కేవలం జనగణన చేపట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం (BC welfare association) జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు బీసీల నిరసన గళాన్ని వినిపిస్తున్నామన్నారు. నల్లకండువాలు ధరించి నిరసన తెలిపారు. కేంద్రం గతంలో ఇచ్చిన తమ హామీ మేరకు వెంటనే బీసీ కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
BC Caste Census | బ్రిటిష్ కాలంలో..
ఎప్పుడో బ్రిటిష్ పాలకుల సమయంలో 1930లో బీసీ కుల గణన జరిగిందన్నారు. దాదాపు వందేళ్లవుతున్నా గణన జరగకపోవడం విచారకరమన్నారు. చెట్టు, పుట్ట, జంతువుల గణన ఈ దేశంలో ఉంది కానీ బీసీల జన గణన లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దర్శనం దేవేందర్, మాడవేడి వినోద్ కుమార్, కొట్టూరు చంద్రకాంత్, శ్రీలత, సాయి బసవ, బాలన్న, నర్సయ్య, సత్యనారాయణ, శంకర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Modi Congress Criticism | కాంగ్రెస్ ఒక ‘పరాన్నజీవి రాజకీయ శక్తి’.. బెంగళూరు సభలో ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

