అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yadagirigutta Road Accident | మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District) అడ్డాకల్ మండలం స్నేహ కంపెనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంతో ఇద్దరు మృతి చెందారు.
పెబ్బేరు మండలం (Pebberu Mandal) కంచిరావుపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్‌రెడ్డి తన కుటుంబంతో కలిసి కారులో యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహ స్వామి దర్శనానికి బయలు దేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన భార్య నందిని, ఏడు నెలల కుమారుడు కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రకాష్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Yadagirigutta Road Accident | అన్నమయ్య జిల్లాలో..
అన్నమయ్య జిల్లా (Annamayya District) మదనపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి, నాలుగు నెలల పసిపాప మృతి చెందారు. మృతుడి భార్య జ్యోతికి తీవ్ర గాయాలు అయ్యాయి. జ్యోతిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి..: MMTS Free Travel | హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం

