Bandi Sanjay Comments | నా మీద కుట్ర పన్నారు.. బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Comments | కేంద్ర మంత్రి బండి సంజయ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పరేడ్​ గ్రౌండ్​ సభలో ఆయన మాట్లాడారు. కొందరు తనపై కుట్ర పన్నారని ఆరోపించారు.

బండి సంజయ్​ కుమారుడిపై ఇటీవల పోక్సో కేసు (POCSO Case) నమోదు అయిన విషయం తెలిసిందే. సాయి భగీరథ్​పై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్​ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా బండి సంజయ్​ మాట్లాడుతూ. తనను నేరుగా ఎదుర్కోలేక ఏదేదో చేస్తున్నారన్నారని చెప్పారు. తాను ఫామ్‌హౌస్‌లో ఎలుకను కాదని చెప్పారు. తాను ఏ రోజు పార్టీ తల వంచుకునే పనులు చేయనని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.

Bandi Sanjay Comments | ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

నిధులు ఇచ్చేది మనం, అభివృద్ధి చేసేది మనం అని బండి సంజయ్​ అన్నారు. యాసంగి పంట కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Bandi Sanjay Comments | ఫామ్​హౌజ్​కు పరిమితం చేశాం

రాముడిని కించపరిస్తే ఊరుకోమని కేంద్ర మంత్రి అన్నారు. జై శ్రీరామ్‌ నినాదంతోనే బీఆర్​ఎస్ (BRS)​ పార్టీని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశామని చెప్పారు. మోదీ లేకుంటే తెలంగాణ ప్రభుత్వం నడవదని పేర్కొన్నారు. తెలంగాణ నిధులను ఢిల్లీకి మోస్తున్నారని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లో బీజేపీ ఈజీగా గెలవలేదన్నారు. 300 మందికి పైగా కార్యకర్తలు బలిదానం చేశారని చెప్పారు. కేరళలో కూడా తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆయన గుర్తు చేశారు.

దీనిని కూడా చదవండి : Bhagirath Sai POCSO Case | భగీరథ్ సాయిని అరెస్ట్ చేయాల్సిందే.. పోలీస్​ స్టేషన్​ను​ ముట్టడించిన మహిళలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *