తెలంగాణAzaruddin Minister Post | అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఉంటుందా!

Azaruddin Minister Post | అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఉంటుందా!

మంత్రి అజారుద్దీన్​కు పదవి గండం పొంచి ఉంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఇంకా ఎమ్మెల్సీగా నియామకం కాలేదు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Azaruddin Minister Post | మంత్రి అజారుద్దీన్​కు పదవి గండం పొంచి ఉంది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఇంకా ఎమ్మెల్సీగా నియామకం కాలేదు. ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి పోతుంది.

ప్రభుత్వం కోదండరాం, అజారుద్దీన్​ను ఎమ్మెల్సీలుగా నామినేట్​ చేసిన విషయం తెలిసిందే. అయితే వారి నియామాకాన్ని గవర్నర్​ ఇంకా ఆమోదించలేదు. అయితే జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) సమయంలో మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్​ అజారుద్దీన్​కు మంత్రి పదవి ఇచ్చింది. 2025 అక్టోబర్​ 31న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఆరు నెలల్లో ఏదైనా చట్ట సభల్లో సభ్యుడు కావాలి. అజారుద్దీన్​ మంత్రి పదవి చేపట్టి ఈ నెల 30తో ఆరు నెలలు పూర్తి కానుంది.

Azharuddin Minister Post

Azaruddin Minister Post | రాజీనామా చేస్తారా..

అజారుద్దీన్​ ఎమ్మెల్సీ నియామకంపై గవర్నర్​ ఇంకా ఆమోదం తెలపడం లేదు. ఈ క్రమంలో సీఎస్​ రామకృష్ణారావు శనివారం గవర్నర్​ను కలిశారు. నియామకానికి ఆమోదం తెలపాలని కోరారు. ఎమ్మెల్సీ నియామకంలో వివాదాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. అజారుద్దీన్ అంశంపై ఇప్పటికే నాలుగు సార్లు గవర్నర్​కు రాష్ట్ర ప్రభుత్వం (State Government) విజ్ఞప్తి చేసింది. అయితే ఈ నెలాఖరులోగా ఎమ్మెల్సీ నియమకానికి గవర్నర్​ ఆమోదం తెలుపకపోతే అజారుద్దీన్​ రాజీనామ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఈ వ్యవహారంపై ప్రత్యేక ఫోకస్​ పెట్టినట్లు సమాచారం. ఎమ్మెల్సీల నియామకానికి ఆమోదం తెలిపేలా గవర్నర్​తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అజారుద్దీన్​తో పాటు కోదండరాం ఎమ్మెల్సీ నియామకం పెండింగ్​లో ఉంది.

ఇది కూడా చదవండి..: Yadagirigutta Road Accident | యాదగిరిగుట్ట వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...