తెలంగాణBandi Bhagirath POCSO Case | బండి భగీరథ్​ కేసులో విచారణ ప్రారంభం : సీఎం...

Bandi Bhagirath POCSO Case | బండి భగీరథ్​ కేసులో విచారణ ప్రారంభం : సీఎం రేవంత్​రెడ్డి

బండి సంజయ్​ కుమారుడు భగీరథ్​పై నమోదైన పోక్సో కేసుపై సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Bhagirath POCSO Case | బండి సంజయ్​ కుమారుడు భగీరథ్​పై నమోదైన పోక్సో కేసుపై సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు అంశంపైన డీజీపీ ,ఇతర అధికారులతో సమీక్ష చేశానని సీఎం చెప్పారు. భగీరథ్​పై పేట్ బషీరాబాద్ స్టేషన్​లో అమ్మాయి తల్లి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ నెల 8న సంజన్ కొడుకుపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని వెల్లడించారు. అంతకు ముందే కరీంనగర్​లో బండి సంజయ్ కుమారుడు వాళ్ల పైన కేసు పెట్టారన్నారు.

Bandi Bhagirath POCSO Case | ప్రధాని పర్యటనతో ..

ప్రధాని మోదీ (Prime Minister Modi) పర్యటనతో ఈ నెల 9,10 తేదీల్లో 10 వేల మంది పోలీసులు భద్రతలో నిమగ్నమయ్యారని సీఎం తెలిపారు. డీజీ నుంచి కింద స్థాయి అధికారుల వరకు అంతా ఈ భద్రతలోనే ఉన్నారని చెప్పారు. దీంతో కేసు విచారణ ఆలస్యం అయిందన్నారు. ఇప్పుడు విచారణ ప్రారంభమైందని, పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.

Bandi Bhagirath POCSO Case | క్షణాల్లో ఏదీ జరగదు

బీఆర్ఎస్ వాళ్లు కోరుకున్నట్లు క్షణాల మీద జరగదని సీఎం పేర్కొన్నారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అన్న విషయాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. సీనియర్ ఉమెన్ ఆఫీసర్​ నేతృత్వంలో సిట్​ ఏర్పాటు చేసి చేయాలని డీజీపీని ఆదేశించినట్లు తెలిపారు. బాధితులను స్టేట్మెంట్ తీసుకుని చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు.

Bandi Bhagirath POCSO Case | ఆర్​ఎస్​ ప్రవీణ్​పై విమర్శలు

ఖాళీగా ఉన్నామని కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డ్యూటీ చేస్తామంటే ఎలా అని సీఎం ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఈ ఫిర్యాదు పైన విచారణ జరిపితే ప్రభాకర్ రావు నీతిమంతుడు అని ఆయనే చెప్పారన్నారు. అది ఆయన నీతి అని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉంటే పోలీస్ కమిషనర్​కు ఇవ్వాలని సూచించారు. బాలికకు సంబంధించిన అంశంలో అంతా బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Bandi Sanjay Son POCSO Case | బండి సంజయ్​ కుమారుడిపై కేసు.. సిట్​ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sand Transport Rules | ఇసుక రవాణాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sand Transport Rules | ఇసుక రవాణా...

Ex Mla Jajala | బండి సంజయ్​ను బర్తరఫ్​ చేయాలి: మాజీ ఎమ్మెల్యే జాజాల

అక్షరటుడే, గాంధారి: Ex Mla Jajala | కేంద్ర మంత్రి పదవి...

Work From Home | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!.. మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ఎన్ఐటీఈఎస్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Work From Home | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న...

TRS Flag Festival | మే 20 నుంచి టీఆర్​ఎస్​ జెండా పండుగలు : కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRS Flag Festival | తెలంగాణ (Telangana)...