నిజామాబాద్Kamareddy House Survey | కామారెడ్డి జిల్లాలో ఇంటింటి సర్వే ప్రారంభం

Kamareddy House Survey | కామారెడ్డి జిల్లాలో ఇంటింటి సర్వే ప్రారంభం

జాతీయ జనగణనలో కీలకమైన గృహజాబితా సేకరణ ప్రక్రియ సోమవారం నుంచి కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా ఎన్యుమరేటర్లు గడపగడపకు వెళ్లి వివరాలను డిజిటల్‌గా ‘హెచ్‌ఎల్‌పీసీ’ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy House Survey | జాతీయ జనగణనలో(Census) కీలకమైన గృహజాబితా (census update) సేకరణ ప్రక్రియ సోమవారం నుంచి కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా ఎన్యుమరేటర్లు గడపగడపకు వెళ్లి వివరాలను డిజిటల్‌గా ‘హెచ్‌ఎల్‌పీసీ’ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Kamareddy House Survey | కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి(Kamareddy) జిల్లాలో మొత్తం 2.65 లక్షల గృహాలు ఉండగా, ఇందుకోసం 1,954 మంది ఎన్యుమరేటర్లను, వీరి పనిని పర్యవేక్షించేందుకు 310 మంది సూపర్‌వైజర్లను నియమించారు. మొదటి రెండు, మూడు రోజులు ఇళ్ల మ్యాపింగ్, నంబర్లు కేటాయించే పనులు చేస్తారు. జనగణనలో భాగంగా గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు స్వీయగణనకు అవకాశం కల్పించగా, జిల్లాలో 80శాతం ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారు ఉన్నప్పటికీ ఈ నెల 9వ తేదీ వరకు కేవలం 9,631 మంది మాత్రమే స్వీయగణన పూర్తి చేశారు.

Kamareddy House Survey | కొన్ని గ్రామాల్లో శతశాతం..

కొన్ని పల్లెలు శత శాతం పూర్తి చేస్తే, మరికొన్ని గ్రామాల్లో స్పందన కరువైంది. ప్రతి ఇంటి నిర్మాణ స్వభావం, కుటుంబీకులు, కొన్ని వసతులు (తాగునీరు, విద్యుత్​, శౌచాలయాలు, ఇతర) ఇలా 33 రకాల వివరాలను ‘హెచ్‌ఎల్‌పీసీ’(HLPC) యాప్‌లో నమోదు చేస్తారు. ఆయా వీధులో ఉన్న అలయాలు, మసీదులు, చర్చిలు, రహదారులు, ప్రధాన స్థలాలను పొందుపరుస్తారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాస్థాయిలో జనగణన ప్రక్రియకు ముఖ్య గణాంకాధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. అనంతపుర కలెక్టర్ (రెవెన్యూ) అతనవ ముఖ్య గణాంకాధికారిగా, డీఆర్​వో గణాంకాధికారిగా పర్యవేక్షిస్తారు. సీపీవో, డీఈఓ, జడ్పీ సీఈవో, డీఎంఈవో ఆదినేతృత్వ అధికారులుగా, పురపాలకాల కమిషనర్లు, మండల స్థాయిలో తహసీల్దార్లు అధికారిగా, ఎంపీడీఓ, అటవీశాఖ టాస్క్ ఎనిస్టార్ అధికారులుగా ఉంటారు.

Kamareddy House Survey | తస్మాత్​ జాగ్రత్త..

జనగణన ముసుగులో కొందరు ఇళ్లలోకి వచ్చి వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. గణనకు వచ్చే వారు నిజమైన అధికారులేనా అని తెలుసుకోవడం ప్రధానం. ప్రభుత్వం ప్రతి ఎన్యుమరేటర్‌కు ప్రత్యేక గుర్తింపు కార్డును జారీ చేసింది. వాటిని తనిఖీ చేసి ధరించాలి. ఈ విషయంలో అందరూ జాగ్రత్త వహించాలి.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | పరారీలో బండి సంజయ్​ కుమారుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Komiravelli Panchayat Bribery | డ్రైనేజీ పైపులైన్​ తొలగించేందుకు లంచం.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శితోపాటు సర్పంచి భర్త!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Komiravelli Panchayat Bribery | రాష్ట్రంలో అవినీతి అధికారులు...

SP Rajesh Chandra | చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల ఆట కట్టించిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పట్టణంలో పలు చోరీలకు...

Modi Online Classes | విద్యాసంస్థలు కొన్నాళ్లు ఆన్​లైన్​ క్లాసులు నిర్వహించాలి : ప్రధాని Modi పిలుపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Modi Online Classes | అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత...

Kamareddy Vegetable Vendors | పట్టణంలో రాత్రివేళ రోడ్డు పక్కనే కూరగాయల విక్రయాలు..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Vegetable Vendors | పట్టణంలో రోజువారీగా కూరగాయల...