Kamareddy Highway Busstand | కామారెడ్డిలో హైవే పక్కన బస్టాండ్ ఏర్పాటు చేయాలి

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Highway Busstand | జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో హైవే పక్కన బస్టాండ్(RTC Bus Stand) ఏర్పాటు చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు (Minister Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

Kamareddy Highway Busstand | ప్రజల ఇబ్బందులు

కామారెడ్డి (Kamareddy) పట్టణ జనాభా లక్షకు పైగా ఉందని, పట్టణం నలువైపులా వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ విస్తీర్ణం చాలా తక్కువ అని, దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 44వ జాతీయ రహదారి విస్తరణతో ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నాగ్‌పూర్, కోరుట్ల(korutla), మెట్‌పల్లి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కామారెడ్డి పట్టణంలోకి రావడం లేదని మంత్రికి వివరించారు. నాన్​స్టాప్ బస్సుల వల్ల ప్రయాణికులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. 44వ జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, ఆర్టీసీకి అనుకూలంగా ఉన్న ఈ స్థలంలో నాన్​స్టాప్ బస్సుల కోసం బస్టాండ్ ఏర్పాటు చేస్తే సమస్య తీరుతుందన్నారు. ఉమ్మడి నిజామాబాద్(Nizamabad), ఆదిలాబాద్(adilabad), కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన కామారెడ్డి నుంచి ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు సులభంగా వెళ్లేందుకు హైవే బస్టాండ్ అత్యవసరమని, వెంటనే చర్యలు చేపట్టాలని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కోరారు.

ఇది కూడా చదవండి:NEET UG Cancelled | నీట్​ పరీక్ష రద్దు.. సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఏ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *