తెలంగాణKalvakuntla Kavitha | ఆదివాసీల హక్కులను హరిస్తున్న కేంద్రం : కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha | ఆదివాసీల హక్కులను హరిస్తున్న కేంద్రం : కల్వకుంట్ల కవిత

కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పెసా చట్టానికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kalvakuntla Kavitha | కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పెసా చట్టానికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు.కల్వకుంట్ల కవితతో ఆల్ ఇండియా ఆదివాసీ కాన్సిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకుల భేటీ ఆదివారం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్స్​లోని రక్షణలను కేంద్రం తొలగిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)లో 3 లక్షల మంది ఆదివాసీలను అడవి నుంచి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి వారికి అడవిలో అన్ని సౌకర్యాలతో కూడిన పునరావాసం కల్పించడం లేదన్నారు.

Kalvakuntla Kavitha | 8వ షెడ్యూల్​లో చేర్చాలి

కేంద్ర ప్రభుత్వం (Central Government) చేపట్టిన జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీ అనే కాలమ్ పెట్టలేదన్నారు. ఇది దేశ మూలవాసులైన ఆదివాసీల సంస్కృతిని అవమానించడమే అని ఆరోపించారు. ఆదివాసీల భాష ‘‘కోయతూర్’’ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్​లో చేర్చాలని కవిత డిమాండ్​ చేశారు.

Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha | 25న కొత్త పార్టీ

కల్వకుంట్ల కవిత ఈ నెల 25న కొత్త పార్టీ పెట్టనున్నారు. ఈ మేరకు ఆమె అని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు నేపథ్యంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున జాగృతిలో చేరుతున్నారు. జాగృతి లీగల్ సెల్ అధ్యక్షుడు అప్పల నరేందర్ (Appala Narendra) ఆధ్వర్యంలో పలువురు అడ్వకేట్లు ఆదివారం జాగృతిలో చేరారు. కవిత కండువా కప్పి వారిని ఆహ్వానించారు. 25న పార్టీ ఏర్పాటు కోసం కవిత గ్రౌండ్​ వర్క్​ పూర్తి చేశారు. ఇటీవల కాశీకి వెళ్లి ప్రత్యేక పూజలు సైతం చేసి వచ్చారు. అయితే పార్టీ పేరు ఏం పెడతారనే ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Revanth Reddy | గవర్నర్​ను కలిసిన సీఎం రేవంత్​రెడ్డి

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...