Ricky Radhan OSD| ముఖ్యమంత్రి పక్కన జ్యోతిష్యుడు.. విజయ్ నిర్ణయంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌‌డెస్క్:Ricky Radhan OSD| తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తారని, కొత్త తరం నాయకుడిగా నిలుస్తారని ఆశించిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (దళపతి) నిర్ణయం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీ (OSD) గా నియమించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Ricky Radhan OSD|జ్యోతిష్యుడికి క్యాబినెట్ హోదా?

తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికీ రాధన్‌ను కీలక పదవిలో నియమించారు. ఈ పదవి ద్వారా ఆయనకు దాదాపు క్యాబినెట్ హోదా దక్కే అవకాశం ఉంది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, పరిపాలనా అనుభవం లేని ఒక జ్యోతిష్యుడికి ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Ricky Radhan OSD|సోషల్ మీడియాలో ట్రోల్స్.. సెటైర్లు!

విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా విజయ్ అనుసరించే పద్ధతులపై సెటైర్లు పేలుతున్నాయి. ఇకపై ప్రోటోకాల్ అధికారుల సూచనల కంటే, జ్యోతిష్యుడు (ఓఎస్డీ) చెప్పిన టైమ్‌కే సీఎం  బయటకు వస్తారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. జ్యోతిష్యుడు సూచించిన కారులోనే ప్రయాణిస్తారని, ఆయన చెప్పిన రంగు దుస్తులనే వేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతారని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

“కొత్త తరం.. కొత్త రక్తం అనుకుంటే, మళ్ళీ పాత పంథాలోనే జ్యోతిష్యుల మీద ఆధారపడటం ఏంటి దళపతి?” అంటూ అభిమానులు సైతం వ్యతిరేకిస్తున్నారు . మరి ఈ విమర్శలపై సీఎం విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.


ఇది కూడ చదవండి: Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు అప్పుడే.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *