నిజామాబాద్Bandi Sanjay Protest | కామారెడ్డిలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం.. మంత్రి పదవికి రాజీనామా...

Bandi Sanjay Protest | కామారెడ్డిలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్

కామారెడ్డిలో కాంగ్రెస్​ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్​ దిష్టిబొమ్మ దహనం చేశారు.

అక్షరటుడే, కామారెడ్డి: Bandi Sanjay Protest | కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Bandi Sanjay Protest | పోలీసులకు కాంగ్రెస్​ నాయకులకు మధ్య తోపులాట..

దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఆ తోపులాటల మధ్యే కాంగ్రెస్ శ్రేణులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేనీ సందీప్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తన పదవిని అడ్డుపెట్టుకుని కేసులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. బండి భగీరథ్​ (Bandi Bhagirath)ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay Protest | అధికారాన్ని ఉపయోగించి..

కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. హనీట్రాప్ కేసుల పేరుతో అసలు అంశాన్ని మళ్లించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే న్యాయం ఉండాలి కానీ బీజేపీ (BJP) పాలనలో అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం జరుగుతోందని విమర్శించారు. బండి సంజయ్ మంత్రి పదవిలో ఉన్నంత వరకు నిష్పక్షపాత దర్యాప్తు జరగదని, వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, కామారెడ్డి రూరల్ అధ్యక్షుడు రాజా గౌడ్, రామాగౌడ్, గుడుగుల శ్రీనివాస్, రామ్మోహన్, కాళ్ల గణేష్, అజ్మత్, ఆనందరావు, గ్యార సాయిలు, అంజద్, లడ్డు, కళ్లెం సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Railway Court | కవితకు షాక్​ ఇచ్చిన రైల్వే కోర్టు.. విచారణకు రావాలని ఆదేశం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bajaj Group Centenary|బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాలు.. దేశాభివృద్ధిలో వందేళ్ల నమ్మకమైన ప్రస్థానం

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bajaj Group Centenary|భారతదేశపు అత్యంత పురాతన , భారీ పారిశ్రామిక...

Paddy Transport | ధాన్యం రవాణాకు లారీలు సమకూర్చని కాంట్రాక్టర్​పై కేసు నమోదు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Paddy Transport | ధాన్యం కొనుగోలు ప్రక్రియకు...

CM Vijay Speech| సీఎం విజయ్ తొలి ప్రసంగం..అసెంబ్లీ సంప్రదాయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు!

అక్షరటుడే వెబ్‌డెస్క్:CM Vijay Speech|తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం...

Lorry Accident | లారీ ఢీకొని తాపీ మేస్త్రి మృతి

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Lorry Accident | లారీ ఢీకొని తాపీ...