అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay Statement | కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. తన కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడాల్సిందే అన్నారు. అయితే తన కుమారుడు ఏ తప్పు చేయలేదని చెబుతున్నాడని చెప్పారు. అయినా ఒక క్రిమినల్‌గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం కరీంనగర్ (Karimnagar)లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. తన కుమారుడిపై నమోదైన పోక్సో కేసు (pocso case)పై స్పందించారు. ‘ఏ తప్పు చేయలేదు.. స్నేహంగా ఉన్నామంటున్నాడు నా కొడుకు..! కానీ బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు’ అని బండి సంజయ్ అన్నారు. తన కుమారుడిని సమర్థించట్లేదని పేర్కొన్నారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని తెలిపారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
Bandi Sanjay Statement | కన్న పేగు తల్లడిల్లుతోంది
తన కుమారుడిపై దాడిని చూసి కన్నపేగు తల్లడిల్లుతోందని కేంద్ర మంత్రి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెప్పారు. తన కుమారుడికి టైమ్ ఇవ్వలేదని, దానికి తప్పు తనదే అన్నారు. తన జీవితంలో ఏ రోజు ఎంజాయ్ చేయలేదని చెప్పారు. పార్టీ జెండా ఏ రోజు పట్టుకున్నానో అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని గుర్తు చేసుకున్నారు. కానీ తన కుటుంబంపై ఈ రోజు కొందరు రాళ్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేయలేదని, బయటకు వస్తానని తన కొడుకు మాట ఇచ్చాడన్నారు. అతడు నిజంగా తప్పు చేస్తే క్షమించనని స్పష్టం చేశారు.
Bandi Sanjay Statement | వారిని విడిచి పెట్టను
కుట్రలు, కుతంత్రాలతో తన కుటుంబాన్ని బజారున పడేశారో వారిని విడిచిపెట్టనని బండి సంజయ్ హెచ్చరించారు. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసినట్లు మీరు పెట్టిన ఈ నిప్పుతో దళారుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అవినీతి వ్యవస్థను దహనం చేస్తానన్నారు. తన గుండె మీద కాషాయం జెండా ఉందని, తల మీద అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయన్నారు.
కుట్రలు, కుతంత్రాలు చేసి ఇవాళ నా కుటుంబాన్ని రోడ్డున పడేసిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టను – బండి సంజయ్ pic.twitter.com/addzTRIUd8
— Tharun Reddy (@Tarunkethireddy) May 12, 2026
ఇది కూడా చదవండి : Paddy Farmers | ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

