తెలంగాణGangadhara Sub Registrar | ఏసీబీ వలలో గంగాధర ఇన్​ఛార్జి సబ్ రిజిస్ట్రార్.. రూ. 1.06...

Gangadhara Sub Registrar | ఏసీబీ వలలో గంగాధర ఇన్​ఛార్జి సబ్ రిజిస్ట్రార్.. రూ. 1.06 లక్షల అక్రమ వసూళ్ల కేసులో అరెస్టు

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు, వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వారు స్పష్టం చేశారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gangadhara Sub Registrar | పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో, ప్రస్తుత గంగాధర ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ మండ కిరణ్ కుమార్‌ను మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు.

Gangadhara Sub Registrar | యూపీఐ చెల్లింపుల రూపంలో

మండ కిరణ్ కుమార్ గతంలో పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, ఇన్​ఛార్జి సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో అంటే.. అక్టోబరు 27, 2025 నుంచి నవంబర్ 12, 2025 మధ్య కాలంలో తన ప్రైవేట్​ అసిస్టెంట్ బిట్టు (రత్న కుమార్) ద్వారా డాక్యుమెంట్ రైటర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. దాదాపు రూ. 1,06,500 మొత్తాన్ని యూపీఐ (UPI) చెల్లింపుల రూపంలో లంచంగా స్వీకరించినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.

Gangadhara Sub Registrar | నిజామాబాద్‌లో అరెస్టు

గతేడాది నవంబర్ 14న పెద్దపల్లి కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కిరణ్​కుమార్​ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, ఆయన ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధరలో విధులు నిర్వహిస్తున్నారు.

సుదీర్ఘ విచారణ అనంతరం, కిరణ్ కుమార్‌ను మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఆయన్ను కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు, వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వారు స్పష్టం చేశారు.

Inter AEC Course | తెలంగాణ ఇంటర్‌లో AEC కోర్సు.. ప్రభుత్వం, అనుబంధ విద్యాసంస్థల్లో ప్రయోగాత్మకంగా అమలు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Balasadan Girls | ముగ్గురు బాలసదన్ బాలికల అదృశ్యం.. నిజామాబాద్​లో ఘటన!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Balasadan Girls | నిజామాబాద్ నగరంలోని సుభాష్‌నగర్...

T-SAT Education Department | ఇక విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఐటీ శాఖ నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: T-SAT Education Department | తెలంగాణ ప్రభుత్వ డిజిటల్...

లక్డీకాపూల్ గ్లెనీగిల్స్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక లేబర్ సూట్ ప్రారంభం

హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని గ్లెనీగిల్స్ హాస్పిటల్స్ (ఫోర్టిస్ నెట్‌వర్క్ హాస్పిటల్) మహిళల ఆరోగ్య...

Bandi Sanjay Statement | నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే : బండి సంజయ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Statement | కేంద్ర మంత్రి...