Gold Import Duty | పెరిగిన దిగుమతి సుంకాలు.. ఒత్తిడిలో నగల కంపెనీల షేర్లు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Import Duty | పశ్చిమాసియాలో జియో పొలిటికల్ టెన్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు పొదుపు చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చారు.

భారతీయులు ఏడాది పాటు గోల్డ్ కొనొద్దంటూ విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగకుండా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను గణనీయంగా పెంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో నగల కంపెనీల షేర్లు మÖడు రోజులుగా ఒత్తిడికి గురవుతున్నాయి.

Gold Import Duty | 15 శాతానికి పెంపు..

బంగారం, వెండి దిగుమతులపై గతంలో ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచగా.. ఇందులో 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం, 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకోవడానికి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ను తగ్గించుకోవడానికి ప్రభుత్వం అనవసర దిగుమతులపై ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. బంగారం దిగుమతులు పెరగడం వల్ల రూపాయి విలువపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో దిగుమతి సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నగల తయారీ వ్యయం పెరగడమే కాకుండా, మార్కెట్లో డిమాండ్ తగ్గుతుందనే భయాలు మదుపరులను వెంటాడుతున్నాయి.

Gold Import Duty | ఆ స్టాక్స్ పై అమ్మకాల ఒత్తిడి..

బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను భారీగా పెంచడంతో మÖడు రోజులుగా జువెలరీ రంగానికి చెందిన కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ (Kalyan Jewellers) ఇండియా, పీసీ జువెలర్, పీఎన్ గాడ్గిల్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలూ నష్టపోయాయి. అయితే దిగుమతి సుంకాల ప్రకటన తర్వాత ఆయా కంపెనీల షేర్లు మొదట్లో ఒత్తిడికి గురయినా తర్వాత వాల్యూ బయ్యింగ్‌తో కోలుకున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్ లో కళ్యాణ్ జ్యువెలర్స్ మాత్రమే నష్టంతో ముగిసింది. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు ఇంట్రాడేలో గరిష్టంగా ఆరు శాతానికిపైగా పడిపోయినా.. తర్వాత కోలుకున్నాయి. చివరికి 1.77 శాతం నష్టంతో ముగిశాయి. టైటాన్ , పీసీ జువెలర్, పీఎన్ గాడ్గిల్ వంటివి స్వల్ప లాభాలతో, సెన్కో గోల్డ్ 4 శాతం లాభంతో ముగిశాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Closing | హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఇన్వెస్టర్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *