తెలంగాణDevji Inter Exam | ఇంటర్​ పరీక్ష రాసిన మావోయిస్ట్​ మాజీ నేత దేవ్​జీ

Devji Inter Exam | ఇంటర్​ పరీక్ష రాసిన మావోయిస్ట్​ మాజీ నేత దేవ్​జీ

మావోయిస్ట్​ కేంద్ర కమిటీ మాజీ సెక్రెటరీ తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ ఇంటర్‌ పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆయన పరీక్ష రాయడం గమనార్హం.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devji Inter Exam | ఒకప్పుడు అడవుల్లో తుపాకీ పట్టుకొని తిరిగిన మావోయిస్ట్​ అగ్రనేత నేడు పరీక్ష కేంద్రంలో పెన్ను పట్టుకొని కనిపించారు. దశాబ్దాల పాటు అజ్ఞాతంలో గడిపిన ఆయన.. నేడు విద్యార్థిగా మారారు.

మావోయిస్ట్​ కేంద్ర కమిటీ మాజీ సెక్రెటరీ తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ ఇంటర్‌ పరీక్ష (Inter Exams)కు హాజరయ్యారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్ల (Korutla)లో ఆయన పరీక్ష రాయడం గమనార్హం. 1980-82లో దేవ్‌జీ కోరుట్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివారు. విద్యార్థి రాడికల్‌ యూనియన్‌లో పనిచేస్తున్న సమయంలో సెకండియర్‌ తెలుగు పరీక్షను దేవ్​జీ బహిష్కరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లొంగిపోయిన ఆయన తాజాగా ఇంటర్‌ బోర్డు (Inter Board) ప్రత్యేక అనుమతితో పరీక్ష రాశారు.

Devji Inter Exam | ఎల్​ఎల్​బీ చదివి..

కోరుట్లలోని మ్యాస్ట్రో జూనియర్‌ కళాశాలలో బుధవారం తెలుగు పరీక్షను దేవ్​జీ రాశారు. న్యాయవాద కోర్సు చేసి పేదల కోసం పనిచేస్తానని దేవ్‌జీ తెలిపారు. ఉద్యమ సమయంలో ఆగిపోయిన తన చదువును దాదాపు 40 ఏళ్ల తర్వాత కొనసాగించాలని దేవ్​జీ నిర్ణయించుకోవడం గమనార్హం. దేవ్​జీ మావోయిస్ట్​ పార్టీలో కీలకంగా పని చేశారు. నంబాల కేశవరావు ఎన్​కౌంటర్​ అనంతరం కేంద్ర కమిటీ సెక్రెటరీగా నియమితులయ్యారు. అయితే ఆపరేషన్​ కగార్​తో కేంద్ర బలగాలు అడవులను జల్లెడ పట్టడంతో ఆయన మరికొంత మందితో కలిసి లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్​ అయిన ఆయన ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టారు.

దీనిని కూడా చదవండి : Jogipet Diesel Theft| జోగిపేటలో చెడ్డి గ్యాంగ్ కలకలం.. బస్సులు, లారీలే లక్ష్యంగా డీజిల్ చోరీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kerala CM Suspense | కేరళం సీఎంపై వీడని సస్పెన్స్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala CM Suspense | కేరళంలో కాంగ్రెస్​...

Mla Bhupathi reddy | విద్యపై ఖర్చు పెట్టడమంటే భవిష్యత్​ తరాలకు పెట్టుబడి లాంటిది..: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Mla Bhupathi reddy | విద్యారంగంపై ప్రభుత్వం పెడుతున్నది...

ACB Raids Shamshabad | ఏసీబీ దాడులు.. డబ్బులు విసిరేసిన ఆర్​ఐ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids Shamshabad | రాష్ట్రంలో అవినీతి...

Bakrid Security Measures | బక్రీద్​ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలి.. డీజీపీ సీవీ ఆనంద్​

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Bakrid Security Measures | బక్రీద్​ను ప్రశాంత...