Flight Ticket Prices | ప్రయాణం ‘గగన’మే!.. గణనీయంగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Flight Ticket Prices | అమెరికా -ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై చేపట్టిన యుద్ధం అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతోంది. జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడం ప్రపంచ విమానయాన రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో విమానయాన సంస్థలు భారాన్ని ప్రజలకు ట్రాన్స్‌ఫర్ చేస్తుండడంతో విమాన టికెట్ల ధరలు పెరుగుతున్నాయి.

ప్రధానంగా భారత్ నుంచి యూరప్, అమెరికా, వెస్ట్ ఏసియా తదితర దేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది పెద్ద షాక్‌గా మారింది. యుద్ధం మొదలైన తర్వాత విమాన టికెట్ ధరలు 25 శాతం నుంచి 150 శాతం వరకు పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు (Travel Agents), ఎయిర్‌లైన్స్ డేటా వెల్లడిస్తోంది. ఇది వేసవి సెలవులలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అదనపు భారంగా మారింది.

Flight Ticket Prices | ఎంత మేర పెరిగాయంటే..

అమెరికా -ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ నుంచి యూరప్, అమెరికా, వెస్ట్ ఏసియా తదితర దేశాలకు విమాన టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి.
ఇండియా -అమెరికా రూట్‌లలో సాధారణంగా రూ.45 వేలనుంచి లక్ష వరకు ఉండే టికెట్లు ఇప్పుడు రూ. 1.3 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు పెరిగాయి. చికాగో -ముంబయి రూట్‌లో 150 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. బెంగళూరు -లండన్ మధ్య టికెట్ల ధర రూ.80 వేల నుంచి రూ. 1.2 లక్షలకు. బెంగళూరు-న్యూయార్క్ మధ్య రూ. లక్ష నుంచి రూ.2 లక్షలకు పెరిగినట్లు చెబుతున్నారు.
ఎకానమీ టికెట్లు సంవత్సరం క్రితం కంటే 24 శాతం పెరగ్గా.. కొన్ని రూట్లలో 2, 3 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది

Flight Ticket Prices | ఫ్యుయల్ సర్‌చార్జీ..

ఇండిగో (IndiGo), ఎయిర్ ఇండియా (Air India), అకాసా ఎయిర్ వంటి సంస్థలు ఫ్యుయల్ సర్‌చార్జీలను పెంచి ప్రయాణికులపై భారాన్ని మరింత పెంచాయి. ఇవి డొమెస్టిక్‌లో రూ. 299 -రూ. 899, ఇంటర్నేషనల్‌లో 24 నుంచి 280 డాలర్ల వరకు అదనపు ఫ్యుయల్ సర్‌చార్జీలు వసూలు చేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో జియో పొలిటికల్ టెన్షన్స్ తో జెట్ ఫ్యూయల్ ధరలు (Jet Fuel Prices) రెట్టింపవడం, ఎయిర్‌స్పేస్ రీరూటింగ్, విమాన సర్వీసుల రద్దు వంటి కారణాలతో టికెట్ల ధరలు గణనీయంగా పెరిగాయి. పరిస్థితి ఇలాగే ఉంటే టికెట్ల ధరలు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Delhi Incident | ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *