జాతీయంSocial Media Misuse | సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు..: ఈసీ

Social Media Misuse | సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు..: ఈసీ

ఎన్నికల వేళ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా, నైతికంగా ఉపయోగించాలని స్పష్టం చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Social Media Misuse | ఎన్నికల వేళ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. సోషల్ మీడియా, డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా, నైతికంగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, ఐటీ నియమాలు 2021, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది.

Social Media Misuse | మూడు గంటల్లో చర్య

సోషల్​ మీడియా ప్లాట్​ఫాంలలో తప్పుదారి పట్టించే పోస్టులు చేసినట్లయితే చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఏఐ ద్వారా తప్పుదారి పట్టించే కంటెంట్ రూపొందించినా మూడు గంటల్లోపు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Social Media Misuse | ఎన్నికల్లో నిరంతర నిఘా

అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంటుందని ఈసీ పేర్కొంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినా.. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు చేసినా.. పోలింగ్ ప్రక్రియ, యంత్రాంగంపై తప్పుడు కథనాలు ప్రచురించినా తక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Social Media Misuse | 11 వేలకు పైగా పోస్టులపై చర్య

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదలైనప్పటి నుంచి పోస్టులపై నిఘా పెట్టామని తెలిపింది. ఇప్పటి వరకు 11,000కి పైగా సోషల్ మీడియా పోస్టులు/లింకులు గుర్తించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. కంటెంట్ తొలగించడంతో పాటు ఎఫ్‌ఐఆర్​లు సైతం నమోదు చేసినట్లు చెప్పింది.

C-Vigil యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు..

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే పౌరులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఫిర్యాదు చేయవచ్చని ఈసీ పేర్కొంది. C-Vigil మాడ్యూల్ ద్వారా సులభంగా తమ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. కాగా.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 19 వరకు C-Vigil యాప్ ద్వారా 3,23,099 ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పింది. వీటిలో 3,10,393 ఫిర్యాదులు అంటే 96.01 శాతం నిర్దేశించిన 100 నిమిషాలలోపు విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపింది.

ఇది కూడా చదవండి..: Modi on Women Reservation | మహిళల కలలను ధ్వంసం చేశారు.. విపక్షాలపై ప్రధాని ఫైర్​

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...