క్రీడలుHardik Pandya Auction | హార్దిక్ కోసం ఐపీఎల్ జట్ల మధ్య పోటీ?.. మెగా వేలంలో...

Hardik Pandya Auction | హార్దిక్ కోసం ఐపీఎల్ జట్ల మధ్య పోటీ?.. మెగా వేలంలో కోట్ల వర్షం ఖాయమే!

ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను విడుదల చేస్తుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా, ఒకవేళ అతడు మెగా వేలంలోకి వస్తే ఐపీఎల్ జట్ల మధ్య భారీ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hardik Pandya Auction | భారత క్రికెట్‌లో స్టార్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) భవిష్యత్తుపై ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ముఖ్యంగా ముంబై ఇండియన్స్ అతడిని కొనసాగిస్తుందా? లేక మెగా వేలానికి వదులుతుందా? అన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ హార్దిక్ వేలంలోకి వస్తే, అతడిని దక్కించుకునేందుకు పలు జట్లు కోట్ల రూపాయలతో పోటీ పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Hardik Pandya Auction | ఢిల్లీకి కావాల్సింది అనుభవజ్ఞుడైన నాయకుడు

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) గత కొన్ని సీజన్లుగా స్థిరమైన భారతీయ కెప్టెన్ కోసం ఎదురుచూస్తోంది. జట్టులో యువ ప్రతిభ ఉన్నప్పటికీ, ఒత్తిడి సమయాల్లో నిర్ణయాలు తీసుకునే నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన అనుభవం ఉన్న హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ ఎంపికగా ఢిల్లీ పరిశీలించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ప్రభావం చూపగల అతని సామర్థ్యం జట్టుకు పెద్ద బలం కావచ్చు.

లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) జట్టులో నాణ్యమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ, నమ్మదగ్గ భారతీయ ఆల్‌రౌండర్ కొరత కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో రిష‌బ్ పంత్  ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, నాయకత్వ బాధ్యతలను కూడా హార్దిక్‌కు అప్పగించే ఆలోచనలో లక్నో ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. పవర్‌ప్లే తర్వాత వేగంగా పరుగులు చేయడం, డెత్ ఓవర్లలో కీలక బౌలింగ్ చేయడం హార్దిక్ ప్రత్యేకత. అనుభవజ్ఞులైన ఆటగాళ్లను ప్రోత్సహించే చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా హార్దిక్‌పై కన్నేసే అవకాశం ఉంది. ధోని తర్వాత లోయర్ ఆర్డర్‌లో మ్యాచ్‌లను ముగించే ఫినిషర్ జట్టుకు అవసరమవుతోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ప్రభావం చూపగల హార్దిక్, భవిష్యత్తులో చెన్నై కెప్టెన్‌గా కూడా ఉపయోగపడతాడని భావిస్తున్నారు.

Hardik Pandya Auction | ఈడెన్ గార్డెన్స్ లో..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) జట్టుకు మిడిల్ ఆర్డర్‌లో అనుభవజ్ఞుడైన ఫినిషర్ అవసరం ఉంది. కష్టసమయాల్లో జట్టును నిలబెట్టగల ఆటగాడిగా హార్దిక్ సరైన ఎంపికగా కనిపిస్తున్నాడు. మరోవైపు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders) ఎప్పుడూ మ్యాచ్ విన్నర్ల కోసం భారీగా ఖర్చు చేయడానికి వెనుకాడదు. హార్దిక్ దూకుడైన ఆటతీరు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మరింత ప్రమాదకరంగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ ఇప్ప‌టి వ‌ర‌కు హార్దిక్‌ను విడుదల చేయనున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇది కూడా చదవండి..: RCB Player Honesty | మ్యాచ్ కన్నా దీని గురించే ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారుగా.. ఆర్సీబీ బ్యాట‌ర్‌ నిజాయితీకి ఫ్యాన్స్ ఫిదా!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sanathnagar TIMS | అంతర్జాతీయ ప్రమాణాలతో టిమ్స్​ ఏర్పాటు చేశాం : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sanathnagar TIMS | దేశంలోనే అత్యధిక వైద్య...

Intermediate Board Negligence|ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం.. రిజల్ట్స్‌లో 5 మార్కులే.. రీవాల్యూయేషన్ చేయిస్తే మైండ్ బ్లాక్

అక్షరటుడే వెబ్‌డెస్క్:Intermediate Board Negligence|ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల చిన్న పొరపాటు...

Petrol Price Hike | నాలుగేళ్ల తర్వాత పెట్రోల్ ధరల పెంపు.. మరో 30 శాతం వడ్డన తప్పదా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Petrol Price Hike | పశ్చిమ ఆసియాలో...

Telangana Protest Arrests | మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ: Telangana Protest Arrests | హైదరాబాద్‌ (Hyderabad)లో శుక్రవారం...