అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Komatireddy Helped Boy | మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Venkat Reddy) గొప్ప మనసు చాటుకున్నారు. కంటి చూపు కోల్పోతున్న ఓ బాలుడికి అండగా నిలిచి మెరుగైన వైద్యం అందేలా చూశారు. దీంతో ఆ బాలుడు ప్రస్తుతం లోకాన్ని చూడగలుగుతున్నాడు.
దేవరకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్ నాయక్ అనే వ్యక్తి కుమారుడికి కంటి సమస్యలు ఉన్నాయి. దీంతో ఎల్వీ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లారు. వారు ఆపరేషన్‌కు భారీగా ఖర్చు అవుతాయని చెప్పారు. దీంతో వారు మంత్రి కోమటిరెడ్డిని (Minister Komatireddy) కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు. పేదరికంలో ఉన్న తాము అంత డబ్బు ఖర్చు పెట్టలేమని ఆయనను వేడుకున్నారు.
Komatireddy Helped Boy | సాయం చేసిన మంత్రి
బాధితుల సమస్య విన్న మంత్రి వెంటనే స్పందించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పేద కుటుంబానికి సాయం అందించి, చిన్నారికి అవసరమైన వైద్యం చేయించి తిరిగి చూపు వచ్చేలా చర్యలు చేపట్టారు.మంత్రి చొరవతో చిన్నారికి శస్త్రచికిత్స విజయవంతమై, తిరిగి చూపు రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆపదలో ఉన్న తమను ఆదుకున్న మంత్రికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
Minister Komatireddy Venkat Reddy Helps Restore Child’s Vision
చిన్నారికి చూపు అందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కంటి చూపు కోల్పోతున్న చిన్నారి చికిత్సకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పేద కుటుంబానికి సహాయం అందించి, చిన్నారికి… pic.twitter.com/cW0kfBC4nz
— Congress for Telangana (@Congress4TS) May 15, 2026
ఇది కూడా చదవండి..: GHMC MoU | ఐఐటీ ఖరగ్‌పూర్‌తో జీహెచ్ఎంసీ ఒప్పందం


