అక్షరటుడే, ఆర్మూర్: Bandi Bhageerath | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ (Minister Sanjay) కుమారుడు బండి సాయిభగీరథ్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ డిమాండ్ చేశారు. నగరంలోని సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Bandi Bhageerath | కేసును తారుమారు చేసేందుకు..
అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడిన తన కుమారుడిని ప్రోత్సహిస్తున్న బండి సంజయ్ తన కేంద్ర సహాయ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సత్తెమ్మ డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని చూసుకొని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి అయి ఉండి ఒక మైనర్ బాలికపై జరిగిన అకృత్యాలను తారుమారు చేసేందుకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం (State Government) బాధితురాలికి అండగా ఉండి, బాలిక కేసు విషయంలో నిష్పాక్షికంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆర్మూర్ ఏరియా అధ్యక్షురాలు జి.పద్మ, ఏరియా కార్యదర్శి లక్ష్మి, ఏరియా నాయకురాలు యం.సునీత, ఎం.స్వారూప, ఇస్తారమ్మ, రేష్మ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Protest Arrests | మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్


