Paddy Procurement | చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, ​భీమ్​గల్ : Paddy Procurement | కొన్నిచోట్ల పంట ఆలస్యంగా చేతికి రావడంతో ధాన్యం కొనుగోళ్లలో స్వల్ప జాప్యం జరుగుతోందని, రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. ఆయన భీమ్​గల్​, వేల్పూర్, చెంగల్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Paddy Procurement | లక్ష టన్నుల ధాన్యం సేకరించాం..

​అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని, మిగిలిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గోదాముల కొరత ఉన్నందున దగ్గరలోని నిల్వ కేంద్రాలకు ట్రాక్టర్ల ద్వారా, దూర ప్రాంతాలకు లారీల ద్వారా ధాన్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు చేసే ప్రచారాన్ని నమ్మి రైతులు (Farmers) తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు.

​Paddy Procurement | ప్రకృతి వనరులపై వెసులుబాటు..

చెరువుల్లో మట్టి, మొరం తీసుకోవడానికి రైతులకు పూర్తి వెసులుబాటు కల్పించామని, ఇందుకోసం అధికారులకు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎక్కడైనా టిప్పర్లను ఆపితే సహించేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో లాభసాటి వ్యవసాయం కోసం 8 రకాల సన్న బియ్యం రకాలను ప్రోత్సహిస్తామని, పామాయిల్ సాగుచేసే రైతులకు సబ్సిడీలు అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సబ్ కలెక్టర్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Elderly Man Missing | పోలీసుల కృషితో పాతికేళ్లకు సొంతింటికి చేరిన వృద్ధుడు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *