హైదరాబాద్Hyderabad Bengaluru High Speed Rail | నల్లమల మీదుగా హైస్పీడ్​ రైలు.. సర్వే కొలిక్కి

Hyderabad Bengaluru High Speed Rail | నల్లమల మీదుగా హైస్పీడ్​ రైలు.. సర్వే కొలిక్కి

హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాథమిక సర్వే కొలిక్కి వచ్చింది. కోకాపేట నుంచి మన్ననూరు, సోమశిల మీదుగా రైలు మార్గం నిర్మించనున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Bengaluru High Speed Rail | హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాథమిక సర్వే కొలిక్కి వచ్చింది. కోకాపేట నుంచి మన్ననూరు, సోమశిల మీదుగా వెళ్లే మార్గాన్ని గుర్తించగా తెలంగాణలో ఐదు స్టేషన్లు ప్రతిపాదించారు.

దేశవ్యాప్తంగా పలు హైస్పీడ్​ రైలు కారిడార్లకు గతంలో కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్​ నుంచి వెళ్లే మ మార్గాలు సైతం ఉన్నాయి. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్​–ముంబై, హైదరాబాద్–చెన్నై మార్గాల్లో హైస్పీడ్​ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో హైదరాబాద్–బెంగళూరు కారిడార్​ కోసం అధికారులు సర్వే చేశారు. రెండు ఐటీ నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ప్రాథమిక ఎలైన్‌మెంట్ సర్వే ప్రక్రియ దాదాపు కొలిక్కి వస్తోంది.

Hyderabad Bengaluru High Speed Rail | 205 కిలోమీటర్లు..

ఈ హైస్పీడ్​ కారిడార్​ (High-Speed ​​Corridor) ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాల మీదుగా సాగనుంది. నల్లమల అటవీ అందాల మధ్యలోనుంచి కొత్త కారిడార్​ నిర్మించనున్నారు. ఈ కారిడార్​ తెలంగాణలో ప్రారంభమై, ఏపీ మీదుగా సాగుతూ.. బెంగళూరులో ముగుస్తుంది. ఈ ప్రాజెక్టులో తెలంగాణలో పరిధిలో 205 కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మించనున్నారు. శంషాబాద్​, మహబూబ్​నగర్​, కర్నూల్​ మీదుగా ట్రాక్​ నిర్మించాలని మొదట నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ భావించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. రైలు సదుపాయం లేని ప్రాంతాల మీదుగా బుల్లెట్ రైలు మార్గాన్ని తీసుకెళ్లాలని సూచించింది. శంషాబాద్, మన్ననూరు-శ్రీశైలం, సోమశిల రూట్ వైపే ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ సైతం మొగ్గు చూపింది. దీంతో ఈ కారిడార్​ కోకాపేటలో ప్రారంభం అయి శంషాబాద్, నల్లమల మీదుగా కర్నూలుకు కనెక్ట్ అవుతుంది.

Hyderabad Bengaluru High Speed Rail | స్టేషన్లు ఇవే..

ఈ హైస్పీడ్​ రైలు కారిడార్​లో తెలంగాణ (Telangana) పరిధిలో ఐదు అత్యాధునిక రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు. శంషాబాద్, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, ఆమన్‌గల్లు, పర్యాటక ప్రాంతాలైన మన్ననూరు, సోమశిలలను స్టేషన్లుగా గుర్తించారు. బుల్లెట్​ రైలు కారిడార్​, స్టేషన్ల ఏర్పాటుతో ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేగాకుండా ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం చాలా తగ్గనుంది. డీపీఆర్ ఆమోదం పొందిన అనంతరం అధికారులు భూసేకరణ ప్రక్రియ చేపట్టనున్నారు.

ఇది కూడా చదవండి..: Tirupati Minor Assault | దారుణం.. 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ లైంగిక దాడి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Fake IPL Ticket Apps | నకిలీ యాప్​ల్లో ఐపీఎల్​ టికెట్స్​.. సీపీ సజ్జానర్​ హెచ్చరిక

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fake IPL Ticket Apps | దేశవ్యాప్తంగా ఐపీఎల్​...

Dengue Prevention Tips | దోమల నిర్మూలనపై నిర్లక్ష్యం చేయవద్దు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Dengue Prevention Tips | వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో...

RTI Act | కామారెడ్డి బల్దియాలో స.హ.చట్టం అమలుపై నిర్లక్ష్యం..

అక్షరటుడే, కామారెడ్డి: RTI Act | మున్సిపల్ కార్యాలయంలో (Kamareddy Municipality)...

Gig Workers Strike | నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gig Workers Strike | పెరిగిన ఇంధన ధరలు,...