Fake IPL Ticket Apps | నకిలీ యాప్​ల్లో ఐపీఎల్​ టికెట్స్​.. సీపీ సజ్జానర్​ హెచ్చరిక

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fake IPL Ticket Apps | దేశవ్యాప్తంగా ఐపీఎల్​ సందడి నెలకొంది. ప్రస్తుతం సీజన్​ ఉత్కంఠగా సాగుతోంది. ఏ జట్టు ప్లే ఆఫ్స్​ చేరుతుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రతి మ్యాచ్​కు ప్రేక్షకులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియం (Uppal Stadium)లో ఈ నెల 22న జరగనున్న మ్యాచ్​టికెట్లకు సైతం భారీగా డిమాండ్ ఉంది.

ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 22న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ మ్యాచ్​కు క్రేజ్​ ఉండటంతో ఇప్పటికే ఎస్​ఆర్​హెచ్​ మేనేజ్​మెంట్​ టికెట్ రేట్లను భారీగా పెంచింది. దీంతో ఈ క్రేజ్​ను కొందరు సైబర్​ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారు.

Fake IPL Ticket Apps | ఫేక్​ యాప్స్​తో..

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల (IPL Tickets) బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్‌ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్‌’ (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. అచ్చం అసలు యాప్‌ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే, మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయం. పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా, మీ బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ నేరగాళ్ల పరమయ్యే ప్రమాదం ఉందని హైదరాబాద్ సీపీ సజ్జనార్​ హెచ్చరించారు.

Fake IPL Ticket Apps | అప్రమత్తంగా ఉండాలి

మ్యాచ్‌ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని సజ్జనార్​ సూచించారు. ఇలాంటి ఫేక్ యాప్​లు, వెబ్ సైట్స్​పై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Bengaluru High Speed Rail | నల్లమల మీదుగా హైస్పీడ్​ రైలు.. సర్వే కొలిక్కి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *