Fuel Price Protest | పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై జీఎస్టీని ఎత్తివేయాలి

Balla Sandeep Kumar

అక్షరటుడే,కోటగిరి: Fuel Price Protest | పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గాలంటే కేంద్ర ప్రభుత్వం (Central Government) వీటిపై జీఎస్టీని ఎత్తివేయాలని సీపీఐ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు.

Fuel Price Protest | ఎన్నికలు ముగియతానే ధరల మోత..

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, మండల కార్యదర్శి ఏ.విఠల్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక సందర్భంగా పెట్రో ధరలు పెరగవని చెప్పిన ప్రధాని ఫలితాలు వచ్చాక పెంచడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వంలో రూ.300 ఉన్న గ్యాస్ ధర బీజేపీ హయాంలో రూ.1000కి పైగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు 45 రోజుల తర్వాతే గ్యాస్ దొరికే అవకాశముందని.. కమర్షియల్ గ్యాస్ దొరకక చిరు వ్యాపారులు హోటళ్లు మూసివేస్తున్నారన్నారు.

దేశంలో కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు పెంచి పేదలపై ప్రత్యక్ష భారాలు మోపడం సరికాదని ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్​పై జీఎస్టీ తెచ్చిందని పెట్రోల్, డీజిల్​పై జీఎస్టీని ఎత్తివేస్తేనే ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల నాయకులు నల్ల గంగాధర్, నీలి శంకర్, రాజు, రాములు, హన్మాండ్లు, అన్సార్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Dengue Prevention Tips | దోమల నిర్మూలనపై నిర్లక్ష్యం చేయవద్దు..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *