Care Degree College | అత్యుత్తమ బోధనకు చిరునామా ‘కేర్​ డిగ్రీ కళాశాల’: డైరెక్టర్​ నరాల సుధాకర్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Care Degree College | నగరంలో రెండు దశాబ్దాలకు పైగా అత్యుత్తమైన విద్యనందిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది కేర్​ డిగ్రీ కళాశాల. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారిని ప్రయోజకులను చేసిన కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులను అమలు చేస్తున్నట్లు కేర్​ డిగ్రీ కళాశాల డైరెక్టర్​ నరాల సుధాకర్​ పేర్కొన్నారు. ఈ మేరకు కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

​Care Degree College | ఆధునిక తరగతి గదులు, ల్యాబ్‌లు..

విద్యార్థులకు సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించేందుకు అధునాతన సాంకేతికతతో కూడిన స్మార్ట్ తరగతి గదులు, అన్ని సౌకర్యాలతో కూడిన సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయని సుధాకర్​ తెలిపారు. ఆయా కోర్సులకు సంబంధించిన పుస్తకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా వేలల్లో పుస్తకాలు, జర్నల్స్, డిజిటల్ లైబ్రరీ సదుపాయం అందుబాటులో ఉందన్నారు.

Care Degree College | ఎంతో క్రీడాకారులను తయారుచేసిన కళాశాల..

క్రీడలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ.. అంతర్జాతీయస్థాయిలో క్రీడాకారులను తయారుచేసిన అనుభవం తమ కేర్​ డిగ్రీ కళాశాలకు ఉందని డైరెర్టర్​ నరాల సుధాకర్​ తెలిపారు. అంతర్జాతీయ హాకీ ప్లేయర్​గా రాణిస్తున్న గుగ్లూత్​ సౌమ్య (Gugluth Soumya) తమ కళాశాల విద్యార్థిని అని చెప్పేందుకు గర్విస్తున్నామన్నారు.

Care Degree College | ​శిక్షణ, ప్లేస్‌మెంట్ సెల్..

విద్యార్థులను కేవలం చదువులకే పరిమితం చేయకుండా, వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన ప్రత్యేక కోచింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసులు నిర్వహించే ప్రత్యేక విభాగాలు తమ కళాశాలలో ఉన్నాయని నరాల సుధాకర్  తెలిపారు. విద్యార్థినులు, విద్యార్థులకు అనుకూలమైన, క్రమశిక్షణతో కూడిన ప్రశాంతమైన వాతావరణంతో పాటు బస్టాండ్​, రైల్వేస్టేషన్లకు కూతవేటు దూరంలో తమ కళాశాల నెలకొల్పబడిందన్నారు.

Care Degree College | కొత్త కోర్సుల వివరాలివే..

ఈ సందర్భంగా కళాశాలలో బీఎస్సీ ఎంఎల్​టీ, బీఎస్సీ డిజిటల్​ మార్కెటింగ్​, బీఎస్సీ నుట్రీషియన్​, బీఎస్సీ డాటా సైన్స్​, బీఏ(హెచ్​ఈపీ) లాంటి కొత్త కోర్సులు కళాశాలలో నిర్వహిస్తున్నాట్లు నరాల సుధాకర్​ తెలిపారు. అలాగే బీబీఏ, బీసీఏ, బీఎస్సీ బీజడ్​సీ, కంప్యూటర్​ సైన్స్​ కోర్సులు కూడా ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్​ కోసం తమ కళాశాలలో చేరాలని ఆయన కోరారు. వివరాలకు కేర్ డిగ్రీ కాలేజీ, తిలక్ గార్డెన్ కాంప్లెక్స్, స్టేషన్ రోడ్, నిజామాబాద్. 9949925676, 9951382993, 9949460640లలో సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్​ బాలకృష్ణ, కళాశాల ఇన్​ఛార్జీలు సందేశ్​ సందీప్​, కిరణ్​ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్, అక్రమ కల్లు లైసెన్స్ ఆరోపణలపై ఇద్దరికి నోటీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *