తెలంగాణACB Trap | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ లైన్​మన్​

ACB Trap | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ లైన్​మన్​

వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్​ కోసం లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్​ లైన్​మన్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్​ కోసం లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్​ లైన్​మన్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి  (Yadadri) జిల్లాలో చోటు చేసుకుంది.

భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన టీజీఎస్‌పీడీసీఎల్ (SPDCL) అసిస్టెంట్ లైన్‌మ్యాన్ పప్పుల రమేష్ ఓ వ్యక్తి బోర్​వెల్​కు విద్యుత్​ కనెక్షన్​ కోసం లంచం డిమాండ్​ చేశాడు. స్తంభాలు పాతడంతోపాటు ట్రాన్స్​ఫార్మర్​ అమర్చడానికి మొత్తం రూ.35 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు శనివారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.35 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అసిస్టెంట్ లైన్​మన్​ పప్పుల రమేశ్​ను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Trap | జోరుగా అవినీతి

రాష్ట్రంలో అన్ని శాఖల్లో జోరుగా అవినీతి సాగుతోంది. కొందరు అధికారులు లంచాలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. విద్యుత్​ శాఖలో అయితే కొందరు లైనమన్లు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నూతన మీటర్​, వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. బోరుబావుల వద్ద ట్రాన్స్​ఫార్మర్లు పాడైన పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ACB Trap | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy Convoy | నా కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ ఆపొద్దు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక నిర్ణయం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Saraswati Antya Pushkaralu | ఈనెల 21 నుంచి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Saraswati Antya Pushkaralu | కాళేశ్వరంలో ఈనెల 21 వ...

Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Southwest Monsoon Kerala | ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు...

Nizamabad Ganja Seizure | నగరంలో భారీగా గంజాయి పట్టివేత

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Ganja Seizure | నగరంలోని రైల్వేస్టేషన్​లో...

Bandi Bhageerath Surrender | పోక్సో కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన బండి భగీరథ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhageerath Surrender | తనపై నమోదు...