క్రైంAustralia Massage Abuse | మసాజ్ పేరుతో 61 మందిపై వేధింపులు.. భారత సంతతి వ్యక్తికి...

Australia Massage Abuse | మసాజ్ పేరుతో 61 మందిపై వేధింపులు.. భారత సంతతి వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష

ఆస్ట్రేలియాలో మసాజ్ థెరపీ పేరుతో మహిళలను వేధించిన భారత సంతతి వ్యక్తికి అక్కడి న్యాయస్థానం భారీ శిక్ష విధించింది.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Australia Massage Abuse |ఆస్ట్రేలియాలో మసాజ్ థెరపీ పేరుతో మహిళలపై ఘోరానికి ఒడిగట్టిన భారత సంతతి వ్యక్తికి అక్కడి న్యాయస్థానం భారీ శిక్ష విధించింది. దాదాపు 61 మంది మహిళలను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష ఖరారైంది. అంతేకాకుండా, శిక్షా కాలం ముగిసిన వెంటనే అతడిని దేశం నుండి బహిష్కరించాలని (డిపోర్ట్ చేయాలని) కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Australia Massage Abuse | నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం..

అధికారుల వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన సుమిత్ (39) అనే వ్యక్తి 2011లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. మసాజ్ థెరపీలో అతనికి ఎలాంటి అధికారిక అర్హతలు, లైసెన్స్‌లు లేవు. అయినప్పటికీ అక్రమ మార్గంలో అక్టోబర్ 2021 నుండి జూలై 2022 మధ్య కాలంలో ఓ మసాజ్ పార్లర్‌లో థెరపిస్ట్‌గా చేరాడు. ఆ సమయంలో చికిత్స కోసం వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితులకు తెలియకుండా వారి రహస్య వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడు.

Australia Massage Abuse | తప్పులను ఒప్పుకున్న నిందితుడు..

ఈ దారుణంపై బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సుమిత్‌పై మొత్తం 97 అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. విచారణ సమయంలో నిందితుడు కోర్టులో తన తప్పులన్నింటినీ అంగీకరించాడు.

Australia Massage Abuse | తీవ్ర ఆగ్రహం..

ఈ కేసుపై విచారణ జరిపిన ఆస్ట్రేలియా న్యాయస్థానం నిందితుడి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చికిత్స కోసం నమ్మి వచ్చిన మహిళల భద్రతను, నమ్మకాన్ని అతడు దారుణంగా దుర్వినియోగం చేశాడని, ప్రొఫెషనల్ విలువలని పూర్తిగా కాలరాశాడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నేరం తీవ్రతను బట్టి అతనికి దాదాపు 14 ఏళ్ల జైలు శిక్ష విధించడమే కాకుండా, శిక్ష పూర్తి కాగానే దేశం సరిహద్దుల నుంచి వెళ్లగొట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:  Bandi Sai Bhageerath Arrest | జ్యుడీషియల్ రిమాండ్‌కు బండి సాయి భగీరథ్

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...