Naikpod Merit Awards | 19న ఆదివాసి నాయకపోడ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Naikpod Merit Awards | ప్రతి ఏడాదిలాగే ఆదివాసి నాయకపోడ్​ విద్యార్థులకు ఈసారి కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు నాయకపోడ్​ సేవా సంఘం జిల్లా(Nizamabad) అధ్యక్షుడు గాండ్ల రాంచందర్​ తెలిపారు.

ఈ మేరకు ఆదివారం ఆర్ ​అండ్ ​బీ గెస్ట్​హౌస్​లో జిల్లా నాయకపోడ్​ (Naikpod) ఉద్యోగుల సేవా సంఘ అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Naikpod Merit Awards | ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సదస్సు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ఆదివాసి నాయకపోడ్ విద్యార్థులకు, యువకులకు విద్య, ఉద్యోగ(Employment Guidance), ఉపాధి అవకాశాల మీద చైతన్య సదస్సు(Tribal Welfare) నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ఎస్సెస్సీ ఇంటర్​, ఉన్నత విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులను సైతం పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. పెర్కిట్​లోని భీమన్న దేవుని కల్యాణ మండలంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల సేవా సంఘం, జిల్లా సేవా సంఘం సహకారంతో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Bhageerath POCSO Case | బండి భగీరథ్​ కేసు.. 14 మంది​ ఇన్​ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *