Modi Sweden Award | స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ కైవసం చేసుకున్న మోడీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Modi Sweden Award | భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీర్తి కిరీటంలో మరో అంతర్జాతీయ అరుదైన గౌరవం వచ్చి చేరింది. స్వీడన్ ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోడీని ఘనంగా సత్కరించింది.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, అంతర్జాతీయ శాంతికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ స్వీడన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Modi Sweden Award | కమాండర్ గ్రాండ్ క్రాస్

స్వీడన్ ప్రభుత్వం ప్రధాని మోడీకి ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్’ (Royal Order of the Polar Star, Commander Grand Cross) పురస్కారాన్ని ప్రకటించి, సత్కరించింది.

ఒక విదేశీ ప్రభుత్వ అధినేతకు స్వీడన్ దేశం అందించే అత్యున్నత స్థాయి గుర్తింపు, గౌరవం ఇదే కావడం విశేషం.

Modi Sweden Award | మోడీ ఖాతాలో 31వ అంతర్జాతీయ పురస్కారం

ప్రధాని నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రపంచ దేశాలతో భారతదేశ బంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో ఆయన అందుకున్న 31వ పురస్కారం ఇది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు మోడీ నాయకత్వాన్ని గుర్తిస్తూ ఇప్పటివరకు అనేక అత్యున్నత పౌర పురస్కారాలను అందించాయి.

తాజాగా స్వీడన్ ఇచ్చిన ఈ గౌరవంతో ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ అరుదైన గౌరవం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ప్రధాని మోడీకి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

Albert Viral Smile | “ఒక చిన్నారి నవ్వు… కుటుంబం జీవితాన్నే…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *