అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Sports Week | ప్రజా పాలన ప్రగతి ప్రణాలికలో భాగంగా ఫిట్‌నెస్, క్రీడా సంస్కృతి, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) క్రీడా వారోత్సవాలను నిర్వహిస్తోంది. మే 18 నుంచి మే 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ వేడుకలను మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో క్రీడా వారోత్సవాలను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం క్రీడా వారోత్సవాలను నిర్వహిస్తోందని మంత్రులు తెలిపారు.
Telangana Sports Week | 5 కి.మీ. వాకథాన్
శారీరక దృఢత్వం, క్రీడాభివృద్ధి, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించేందుకు మంత్రులు, అధికారులు 5 కిలోమీటర్ల వాకథాన్‌ను కూడా ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ క్రీడా పోటీలు, ఫిట్‌నెస్ కార్యకలాపాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, యువత సాధికారతను ప్రోత్సహించడం దీని ఉద్దేశం.
ఇది కూడా చదవండి..: US Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ జిల్లా యువతి మృతి


