అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Warangal Police | రాష్ట్రంలో రౌడీ షీటర్లు పెరిగిపోయారు. పదే పదే నేరాలకు పాల్పడుతూ వీరు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పలువురు యువత సైతం ఇలాంటి వారి గ్యాంగ్‌లో చేరడం, రౌడీ షీటర్లుగా మారడం చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు.
వరంగల్ పోలీసులు అజం జాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న శివనగర్ వరకు రౌడీషీటర్లతో బహిరంగ యాత్ర నిర్వహించారు. పదేపదే నేరాలు చేసేవారికి గట్టి హెచ్చరిక పంపే లక్ష్యంతో మండుటెండలో సీఐ రమేష్, ఎస్సైల ఆధ్వర్యంలో నగరంలోని రౌడీ షీటర్లను రోడ్లపై తిప్పారు. అనంతరం ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట వారిని బైండోవర్ చేశారు.
Warangal Police | భయం కలిగించడానికి..
పోలీసు సిబ్బంది ముందు నడుస్తుండగా, పోలీసు జీపులు వెనుక వెంబడిస్తూ, మధ్యలో రౌడీషీటర్లు కవాతు చేయడం గమనార్హం. నేరస్థులలో భయాన్ని కలిగించి, పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఈ చర్య చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి చర్యలతో రౌడీ షీటర్లలో భయం పెరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. పోలీసులు చేపట్టిన చర్యపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Warangal Police Take Innovative Action Against Rowdy Sheeters
In a strong and unusual crackdown on criminal activities, Warangal police conducted a public march with rowdy sheeters from Ajam Jahi Mills Colony Police Station to Shivnagar near the Khila Warangal Tahsildar Office… pic.twitter.com/ZWDtw25OVx
— Jacob Ross (@JacobBhoompag) May 18, 2026
దీనిని కూడా చదవండి : US Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ జిల్లా యువతి మృతి


