Congress Leader Suspension | కీచక కాంగ్రెస్ నేతపై సస్పెన్షన్ వేటు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Congress Leader Suspension | ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) కేటాయించాలంటే తన కోరిక తీర్చాలని వేధించిన ఘటనలో కాంగ్రెస్​ పార్టీ నాయకుడిపై అధిష్ఠానం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Congress Leader Suspension | ‘అక్షరటుడే’లో వచ్చిన కథనానికి స్పందిస్తూ..

‘కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తానని వేధింపులు.. కాంగ్రెస్​ నాయకుడిపై పోలీసులకు మహిళ ఫిర్యాదు’ శీర్షికతో ‘అక్షరటుడే’లో(Akshara Today) సోమవారం కథనం ప్రచురితమైంది.

ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ కాంగ్రెస్​ నాయకుడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది.

అయితే, కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా అంతటా ఈ కథనం వైరల్​గా మారింది. దీంతో రాజంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి పార్టీ డ్యామేజీ కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బాధిత మహిళ అంశంలో సదరు నాయకుడిపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఈ మేరకు రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంకం కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. రాజంపేట టౌన్ అధ్యక్షుడిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తులో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Telangana Government GO 685 | ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ‘అదర్ డ్యూటీ’ సౌకర్యం.. ఉత్తర్వులు జారీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *