Telangana Rain Alert | పలు జిల్లాలకు వర్ష సూచన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్:Telangana Rain Alert | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అయితే రెండు రోజులుగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సైతం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి, ఆదిలాబాద్​, నిర్మల్​, నిజామాబాద్ (Nizamabad)​, నారాయణపేట్, మహబూబ్​నగర్​ జిల్లాల్లో నేడు సాయంత్రం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి ఎల్లారెడ్డి నియోజకవర్గం (Yellareddy Constituency)లో అనేక చెట్లు కూలిపోయాయి. మెదక్​ జిల్లాల్లో సైతం భారీ వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.

Telangana Rain Alert | మండుతున్న ఎండలు

రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నా.. ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. వర్షాలతో గాలిలో తేమ ఎక్కువై ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిర్మల్​, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, ములుగు, కరీంనగర్​ జిల్లాల్లో నేడు ఎండతీవ్రత అధికంగా ఉండనుంది. ఆయా జిల్లాల్లో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్​ రికార్డు అయ్యే ఛాన్స్​ ఉంది. హీట్​వేవ్​ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: International Museum Day | మ్యూజియాలు జీవన విధానానికి జ్ఞాన కేంద్రాలు – మంత్రి జూప‌ల్లి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *