సినిమాPeddi Major Twist | ‘పెద్ది’లో అసలు ట్విస్ట్ ఇదేనా?.. ట్రైలర్‌తో కొత్త చర్చకు తెరలేపిన...

Peddi Major Twist | ‘పెద్ది’లో అసలు ట్విస్ట్ ఇదేనా?.. ట్రైలర్‌తో కొత్త చర్చకు తెరలేపిన రామ్ చరణ్ పాత్ర!

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై కొత్త చర్చలు మొదలయ్యాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Peddi Major Twist | మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘పెద్ది’ ట్రైలర్ (Peddi Trailer) ఇటీవల విడుదలైంది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మల్టీ స్పోర్ట్స్ రూరల్ యాక్షన్ డ్రామాగా ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఈ ట్రైలర్ కేవలం యాక్షన్ లేదా ఎమోషన్ మాత్రమే కాకుండా కథపై కూడా కొత్త సందేహాలను రేకెత్తించింది.

ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్‌లో రామ్ చరణ్‌ (Ram Charan)ను గ్రామీణ క్రికెటర్‌గా, మల్లయోధుడిగా చూపించారు. దీంతో చాలామంది ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని భావించారు. అయితే తాజాగా వచ్చిన ట్రైలర్‌లో ఆయన అథ్లెట్‌గా కూడా కనిపించడం కథలో మరో కోణాన్ని సూచిస్తోంది.

Peddi Major Twist | ఇదే అస‌లు ట్విస్ట్..

ట్రైలర్‌లో అథ్లెట్ జెర్సీ (Athlete Jersey)తో కనిపించినప్పటికీ, ఆ పాత్రకు సంబంధించిన పూర్తి విజువల్స్ చూపించకపోవడం ఆసక్తిని మరింత పెంచింది. ముఖ్యంగా 27 నంబర్ జెర్సీ ధరించిన చరణ్ నడిచే విధానం కొంత భిన్నంగా కనిపించడంతో సోషల్ మీడియాలో కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో ‘పెద్ది’ కథ మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ అనే ప్రచారం జరిగింది. అయితే దర్శకుడు బుచ్చిబాబు సాన ఆ వార్తలను ఖండించారు. తమ ప్రాంతానికి చెందిన పెద్దిరాజు అనే యువకుడి స్ఫూర్తితో ఈ కథను రూపొందించినట్లు తెలిపారు. అతను తాపీ పని చేస్తూనే క్రికెట్, వాలీబాల్ ఆడేవాడని, అక్కడి నుంచే మల్టీ స్పోర్ట్స్ వ్యక్తి కాన్సెప్ట్ పుట్టిందని చెప్పారు.

Peddi Major Twist | సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ

ఇప్పుడు ట్రైలర్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమాలో రామ్ చరణ్ పారా అథ్లెట్‌గా కనిపించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమాలో చివరి భాగం చాలా భావోద్వేగంగా ఉంటుందని దర్శకుడు గతంలో చెప్పిన వ్యాఖ్యలను దీనికి అనుసంధానం చేస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ట్రైలర్‌లో చూపించిన కొన్ని విజువల్స్ ఆధారంగా మాత్రమే ఈ విశ్లేషణలు జరుగుతున్నాయి. అసలు కథలో ఏముంది? రామ్ చరణ్ పాత్ర వెనుక దాగిన ట్విస్ట్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

మొత్తానికి ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. రామ్ చరణ్ లుక్, బాడీ ట్రాన్సఫ‌ర్‌మేష‌న్, నటనతో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’పై పడింది.

ఇది కూడా చదవండి..: Euphoria | ‘యుఫోరియా’: సుఖ భ్రమల్లో యువత.. కన్నీటిలో మునిగిన సమాజం!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Telangana IAS Officers|తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌కు జాతీయ స్థాయిలో అరుదైన...

Power Supply Disruption | గాలివాన బీభత్సం.. 24 గంటలుగా విద్యుత్​ లేక అవస్థలు..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Power Supply Disruption | మండలంలో సోమవారం సాయంత్రం...

Yellareddy Police | అన్నదాత బలవన్మరణం..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Police | అనారోగ్యంతో రైతు ఉరివేసుకుని బలవన్మరణం...

Tank Repair Works | చెరువుల మరమ్మతులపై అలసత్వం వహించొద్దు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

అక్షరటుడే, డిచ్​పల్లి: Tank Repair Works | నియోజకవర్గంలో చెరువులు, చెక్​డ్యాంల...