Stock Market Fall | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Fall | ఇరాన్‌పై భారీ దాడులను కొంతకాలంపాటు వాయిదా వేయాలని నిర్ణయించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ తో క్రమంగా పడిపోయింది. చివరికి నష్టాలతో ముగిసింది. మంగళవారం ఉదయం 132 పాయింట్ల లాభంతో ప్రారంభమై సెన్సెక్స్ వెంటనే 70 పాయింట్లు కోల్పోయింది.

అక్కడినుంచి కోలుకుని 375 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 26 పాయింట్ల లాభంతో ప్రారంభమెనా మొదట్లో 28 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 135 పాయింట్లు ఎగబాకింది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 631 పాయింట్లు, నిఫ్టీ 195 పాయింట్లు పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 114 పాయింట్ల నష్టంతో 75,200 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 23,618 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Fall | మిక్స్‌డ్ గా ఇండెక్స్‌లు..

నిఫ్టీ లో ఐటీ ఇండెక్స్ 3.23 శాతం పెరగ్గా.. రియాలిటీ 1.43 శాతం, మీడియా ఇండెక్స్ 1.18 శాతం, యుటిలిటీ 0.67 శాతం, పవర్ 0.57 శాతం లాభపడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ 0.24 శాతం, టెలికాం 0.21 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.13 శాతం నష్టపోయాయి.

Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,590 కంపెనీలు లాభపడగా 1,596 స్టాక్స్ నష్టపోయాయి. 166 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 91 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 33 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 12 స్టాక్ లాభపడగా.. 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్ 4.77 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.73 శాతం, టెక్ మహీంద్రా 2.42 శాతం, ఎటర్నల్ 2.40 శాతం, టీసీఎస్ 1.90 శాతం లాభపడ్డాయి.

Top losers : కొటక్ బ్యాంక్ 2.51 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.69 శాతం, టైటాన్ 1.63 శాతం, ఎయిర్‌టెల్ 1.40 శాతం, సన్‌ఫార్మా 1.24 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Moto G37 Power | మోటో నుంచి పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్.. సేల్ ఎప్పటినుంచంటే?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *