Power Supply Disruption | గాలివాన బీభత్సం.. 24 గంటలుగా విద్యుత్​ లేక అవస్థలు

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Power Supply Disruption | మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(heavy rain) బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి 15 చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో గండి మాసానిపేట్ (Gandi Masanipet), కొత్తపల్లి, తిమ్మాపూర్, హాజీపూర్, బాలాజీ నగర్ తదితర గ్రామాలకు సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

Power Supply Disruption | ప్రజలు ఉక్కిరిబిక్కిరి..

ఎండాకాలం కావడంతో 24 గంటలుగా కరెంటు లేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు వేడికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి సరఫరాకు మోటార్లు నడవక ప్రజలు నీటికష్టాలు అన్నీఇన్నీ కావు. మంగళవారం ఉదయం నుంచి ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మతు పనులను వేగవంతం చేశారు. విరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసే పనులు, తెగిన వైర్ల బిగింపు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అకాల వర్షం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, స్థానికంగా విద్యుత్ స్తంభాలు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ట్రాన్స్​కో ఏఈ(Transco) తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సాయంత్రం లోపు పూర్తిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad Crime News|హైదరాబాద్‌లో ఘోరం.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని యువతిపై గ్యాంగ్ రేప్

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *