అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Property Tax | కామారెడ్డి పురపాలక సంఘంలో (Kamareddy municipality) ఆస్తిపన్ను వసూళ్లలో భారీగా లోటుపాట్లు బయటపడ్డాయని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి వెల్లడించారు. భువన్ సర్వే (Bhuvan survey) ప్రకారం ఏకంగా 5617 అసెస్మెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఆమె తెలిపారు.
Kamareddy Property Tax | ఇంటి నంబర్లు లేని ఇళ్లు 480..
రాష్ట్ర ప్రభుత్వం మే నెల 2న విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం నిర్వహించిన భువన్ సర్వేలో ఈ వివరాలు వెలుగుచూశాయని ఛైర్పర్సన్ తెలిపారు. 2021-22, 2022-23లలో భువన్ యాప్ ద్వారా రూ.1.04 కోట్ల ట్యాక్స్(property tax) వసూలు చేసినట్లు వివరించారు. పట్టణంలో ఇంటి నెంబర్లు లేని ఇళ్లు సుమారు 480 వరకు ఉన్నట్లు వార్డు అధికారులు గుర్తించారని, అలాంటి ఇంటి యజమానులకు డాక్యుమెంట్లు, పర్మిషన్ కాపీ, ఇంటి ఫొటో సమర్పించాలన్నారు. 2024-25, 2025-26లో కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన 1,140 ఇళ్లకు నెంబర్లు కేటాయించినట్లు చెప్పారు. 2022-25, 2025-26 మధ్య కాలంలో అండర్ అసెస్ ద్వారా 3,921 ఇళ్లను గుర్తించి రూ.2.80 కోట్ల వరకు పన్ను పెంపుదల చేసినట్లు వెల్లడించారు.
2007 గెజిట్ రిజిస్టర్ ప్రకారం పట్టణాన్ని జోన్-1, 2, 3, 4లుగా విభజించి కమర్షియల్ ట్యాక్స్ విస్తరించనున్నట్లు తెలిపారు. పెండింగ్ అసెస్మెంట్లను సకాలంలో పూర్తి చేయాలని వార్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అండర్ అసెస్డ్, అన్ అసెస్డ్ ఇళ్ల వివరాల కోసం భువన్ యాప్ ద్వారా వార్డు అధికారులు వచ్చినప్పుడు ప్రజలు సరైన కొలతలు, డాక్యుమెంట్లు అందించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. భువన్ సర్వే తర్వాత మొత్తం రూ.3.84 కోట్ల మేర ఆస్తిపన్ను పెంపుదల జరిగినట్లు ఛైర్పర్సన్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Telangana IAS Officers| జాతీయ స్థాయిలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల హవా.. ‘టాప్ 100’ జాబితాలో ముగ్గురికి చోటు


