అక్షరటుడే, బాన్సువాడ: Youth Drowning | ఎండ వేడిని తట్టుకోలేక స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మంగళవారం బాన్సువాడ (Banswada) మండలం సోమేశ్వర్ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Youth Drowning | పోతంగల్ మండలం..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతంగల్ (Pothangal) మండలం హంగర్గా ఫారం గ్రామానికి చెందిన షేక్ అయాన్ (20) జీవనోపాధి కోసం ఇంటి నిర్మాణ పనుల్లో సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం తరచూ బాన్సువాడ ప్రాంతానికి వచ్చేవాడు. మంగళవారం మధ్యాహ్నం తీవ్ర ఎండల నేపథ్యంలో స్నేహితులతో కలిసి సోమేశ్వర్ గ్రామంలోని స్టోన్ క్రషర్ల (Stone Crushers) సమీపంలో ఉన్న చిన్నపాటి కుంట వద్దకు వెళ్లాడు. నీటిలోకి దిగి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయినట్లు సమాచారం. స్నేహితులు గమనించి అతడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు (Banswada Police) ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.


