జాతీయంLadakh Tour Package | లడాఖ్ అందాలను చూసొద్దామా..

Ladakh Tour Package | లడాఖ్ అందాలను చూసొద్దామా..

లడాఖ్ చుట్టి రావాలి అన్న తెలంగాణ ప్రాంతవాసుల కలను సాకారం చేసేందుకు ఐఆర్‌సీటీసీ ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ladakh Tour Package | లడాఖ్ చుట్టి రావాలి అన్న తెలంగాణ ప్రాంతవాసుల కలను సాకారం చేసేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. 6 రాత్రులు, 7 పగళ్ల ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ఇది. ఇది కేవలం ఒక టూర్ కాదు… హిమాలయాల్లోని ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అందివచ్చిన అద్భుత అవకాశం. ప్యాకేజీ వివరాలిలా ఉన్నాయి.

Ladakh Tour Package | ప్యాకేజీ వివరాలు..

వ్యవధి 6 రాత్రులు /7 పగళ్లు.

డిపార్చర్ తేదీ: 19 జూన్ 2026. టూర్ హైదరాబాద్‌నుంచి ప్రారంభమవుతుంది.
ప్రధాన సందర్శన ప్రదేశాలు: లేహ్, షామ్ వ్యాలీ, నుబ్రా వ్యాలీ, తుర్తుక్, పాంగాంగ్ లేక్, థాంగ్ జీరో పాయింట్.
వసతి: లేహ్‌లో 3 నైట్స్ హోటల్, నుబ్రాలో 2 నైట్స్ క్యాంప్, పాంగాంగ్‌లో 1 నైట్ క్యాంప్ ఉంటాయి.

Ladakh Tour Package | రోజువారీగా టూర్ వివరాలు..

డే 1 : జూన్ 19 న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానంలో లేహ్ కు పయనం. అక్కడికి చేరుకున్న తర్వాత హోటల్ లో బస.
కు ట్రాన్స్‌ఫర్. ఈ ప్రాంతం సుమారు 11,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. కాబట్టి మొదటి రోజు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. లేహ్ మార్కెట్‌లో తిరుగుతూ ఆక్సిజన్ స్థాయికి అలవాటు చేసుకోవాలి. రాత్రి లేహ్ హోటల్ లోనే బస చేస్తారు.

డే 2: షామ్ వ్యాలీ సైట్ సీయింగ్ కు పయనం. లేహ్ ప్యాలెస్, హాల్ ఆఫ్ ఫేమ్, గురుద్వారా పత్థర్ సాహిబ్, మాగ్నెటిక్ హిల్, ఇండస్ – జాన్స్కార్ నదుల సంగమ ప్రాంతం, అల్చి మొనాస్టరీ చూసి తిరిగి లేహ్‌కు చేరుకుంటారు.

డే 3: లేహ్ నుంచి నుబ్రా వ్యాలీకి పయనం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఖార్దుంగ్ లా పాస్ (18,380 అడుగులు) ద్వారా నుబ్రా వ్యాలీకి చేరుకుని హండర్ గ్రామం, డిస్కిట్ మొనాస్టరీ, డబుల్ హంప్డ్ కామెల్ సఫారీ (ఆప్షనల్) వీక్షించవచ్చు. రాత్రి నుబ్రాలో క్యాంప్ ఉంటుంది.

డే 4: నుబ్రా నుంచి తుర్తుక్ ఎక్స్‌కర్షన్.. భారత్-పాక్ సరిహద్దు సమీపంలోని అందమైన తుర్తుక్ గ్రామం ఉంది. దీనిని 1971 యుద్ధంలో భారత్ స్వాధీనం చేసుకుంది. ఈ గ్రామంలో బాల్టీ సంస్కృతి, ఆప్రికాట్ తోటలు, సిల్క్ రూట్ చరిత్ర చూడవచ్చు. సియాచిన్ వార్ మెమోరియల్, థాంగ్ జీరో పాయింట్ సందర్శనలు ఉంటాయి. రాత్రి నుబ్రాలోనే బస కల్పిస్తారు.

డే 5: నుబ్రా నుంచి పాంగాంగ్ లేక్ కు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాంగాంగ్ లేక్ కు తీసుకువెళ్తారు. ఇక్కడ నీటి రంగులు మారుతూ ఉండడం గమనించవచ్చు. చుట్టూ హిమాలయాలు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక్కడ సూర్యోదయం జీవితాంతం గుర్తుండే మధురమైన అనుభవంగా నిలిచిపోతుంది.

డే 6: పాంగాంగ్ నుంచి లేహ్‌కు చేరుకుంటారు. మార్గమధ్యలో థిక్సే మొనాస్టరీ, షే ప్యాలెస్, రంచో స్కూల్ లను చూపిస్తారు. సాయంత్రం లేహ్ మార్కెట్‌లో షాపింగ్ చేయొచ్చు.

డే 7: ఉదయం లేహ్ నుంచి ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ తిరుగు ప్రయాణం.

Ladakh Tour Package | ప్యాకేజీ చార్జీల వివరాలు..

ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.53,670, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 59,330, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 60,580 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు రూ. 41,910, 2 నుంచి 4 ఏళ్లలోపు పిల్లలకు రూ. 40,670 చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్లలోపు పిల్లల చార్జీ వేరుగా ఐఆర్‌సీటీసీ ఆఫీస్‌లో చెల్లించాలి.
ప్యాకేజీలో కవర్ అయ్యేవి..
రౌండ్ ట్రిప్ ఫ్లైట్, హోటల్/క్యాంప్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, సైట్ సీయింగ్, గైడ్, ఇన్నర్ లైన్ పర్మిట్, ఆక్సిజన్ సపోర్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ మొదలైనవి.

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ https://www.irctctourism.com లేదా IRCTC యాప్‌లో సెర్చ్ చేయండి.

ఇది కూడా చదవండి..: TVK Vijay Alliance | టీవీకే విజయ్​కు మొదలైన ‘పొత్తుల’ సెగ.. ఆ పనిచేస్తే మద్దతుపై పునరాలోచిస్తామన్న సీపీఎం..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad Fire Accident | హైదరాబాద్​ నగరంలో గురువారం...

Visakhapatnam Infrastructure Funds|విశాఖలో 3 భారీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అక్షరటుడు వెబ్‌డెస్క్:Visakhapatnam Infrastructure Funds|విశాఖపట్నం(Visakhapatnam) నగరంలో మౌలిక వసతుల ఆధునీకరణ, పట్టణాభివృద్ధి...

Stock Market Gains | లాభాల్లో మార్కెట్లు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Gains | పశ్చిమాసియాలో నాటకీయ పరిణామాలు...

Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త మార్పులు.. భద్రత కోసం రెండు మినీ బస్సులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Convoy | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి...