Shiva Temple Theft | శివాలయంలో చోరీ.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Shiva Temple Theft | వేసవిలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎల్లారెడ్డి (Yellareddy), కామారెడ్డి (Kamareddy) ప్రాంతాల్లో వరుస చోరీలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా రామారెడ్డి (Ramareddy) మండలం పోసానిపేట గ్రామంలోని శివాలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి.

Shiva Temple Theft | సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ..

ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసినప్పటికీ చోరీలు ఆగట్లేదు. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో ఉన్న శివాలయానికి ప్రతిరోజు లాగే పూజారి తాళం వేశారు. అయితే రాత్రి ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి చొరబడి గర్భగుడిలో ఉన్న హుండీలో నుంచి సుమారు రూ.30 వేల నగదు, ఆలయంలోని అమ్మవారి పుస్తెమట్టెలు దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. అయితే చోరీకి పాల్పడింది గ్రామానికి చెందిన వారేనా.. ఇతర ప్రాంతాల వ్యక్తులా తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Caste Census Support| బీసీలు ఎదగడం మోదీకి ఇష్టం లేదు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *