నిజామాబాద్Kamareddy Degree Results | సెమిస్టర్ ఫలితాల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

Kamareddy Degree Results | సెమిస్టర్ ఫలితాల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

సెమిస్టర్ ఫలితాల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Degree Results | సెమిస్టర్ ఫలితాల్లో (Semester Result) కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Kamareddy Degree College) విద్యార్థులు ప్రతిభ చూపారు. 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ (Telangana University) పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్ అధికారికంగా వెల్లడించారు.

Kamareddy Degree Results | విద్యార్థులకు అభినందన..

ఈ సందర్భంగా విద్యార్థులు సాధించిన అద్భుతమైన ప్రతిభను సంపత్​కుమార్​ ప్రత్యేకంగా అభినందించారు. ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫలితాల్లో 10 సీజీపీఏకి (CGPA Toppers) గాను షేక్ నేహా బీఎఫ్​సీ 9.87, చింతకింది హేమవంతిని బీజెడ్​సీ 9.58, లక్ష్మీ ప్రసన్న బీఎస్సీ ఆనర్స్ 9.57, ఎం.మహేశ్వరి బీఎస్సీ బీజడ్​సీ 9.56, ఈ శరణ్య బీఎస్సీ ఎంపీసీఎస్ 9.47, స్వప్న బీఎస్సీ ఆనర్స్ 9.35, ఎన్.దివ్యశ్రీ బీఎస్సీ బీఎఫ్​సీ 9.28, ఎస్.రఘు బీఎస్సీ జెడ్​ఎఫ్​సీ 9.27, శ్రీవల్లి బీఎస్సీ ఆనర్స్ 9.26, దువ్వల మానస బీకాం 9.05, రూప బీకాం 9.03, సంకీర్త బీకాం 9.01, ఎర్రోళ్ల విష్ణు బీఏ 8.81, సభావాత్ మౌనిక బీఏ 8.81, రమావత్ శ్రీలత బీఏ 8.50 సీజీపీఏ సాధించారు.

Kamareddy Degree Results | అధ్యాపక బృందం..

ఉత్తమ ఫలితాలు సాధించి టాప్​లో నిలిచి కళాశాల కీర్తి ప్రతిష్టలు నలుదిశలా చాటిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి రికార్డుస్థాయి ఫలితాలు సాధించడం సంతోషకరమని తెలిపారు. అధ్యాపకుల నిరంతర కృషి, పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ నాణ్యమైన విద్యా విజయాలు సాధ్యమయ్యాయన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఇదే స్ఫూర్తిని కొనసాగించి కళాశాలకు, తల్లిదండ్రులకు మరింత కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శాంతాబాయి, కళాశాల పరీక్షా విభాగం అధికారులు ఎన్.రాములు, ఏ.రాజేందర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Nizamsagar CWC Visit | నిజాంసాగర్ పరీవాహక ప్రాంతాల్లో సీడబ్ల్యూసీ బృందం పర్యటన

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి...

Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న...

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...