అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad CP | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) సూచించారు. పోలీస్ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Nizamabad CP | బక్రీద్ సందర్భంగా..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ (bakrid) పండుగ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్మాత్మక ప్రాంతాల్లో సిబ్బందిని ఎక్కువగా మోహరించేలా చూడాలన్నారు. పెండింగ్ కేసులో పురోగతిపై ప్రత్యేకంగా సమీక్షించిన ఆయన స్టేషన్ల వారీగా వివరాలు తెలుసుకున్నారు.
Nizamabad CP | పాత నేరస్తులపై నిఘా..
కమిషనరేట్ పరిధిలో (Nizamabad Police) పాత నేరస్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలకు పాల్పడిన వారిపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో..
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌బాస్ ఆదేశించారు. డ్రగ్స్ గంజాయి నిర్మూల కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని అక్రమ రవాణా కార్యక్రమాల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, ఏసీపీ ప్రకాష్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేష్, సీసీఆర్బీ సీఐ అంజయ్య, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, ఐటీకోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Jagtial | జగిత్యాల జిల్లాలో విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి


