అక్షరటుడే, లింగంపేట: Yellareddy Development | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని.. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ (Congress Party) లింగంపేట మండల అధ్యక్షుడు గోకుల్ సాయిరాం అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఓడించి మూలకు కూర్చోబెట్టారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోల్కంపేట్ చౌదరి చెరువుకు గండిపడి మూడేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో వెంటనే మరమ్మతులు చేయించారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సొంత గ్రామమైన నల్లమడుగులో కొన్నేళ్లుగా మురికికాల్వల సమస్య ఉండేదని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) వచ్చాకే డ్రెయినేజీల నిర్మాణం పూర్తయిందన్నారు. నియోజకవర్గంలో రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం తగదన్నారు.
Yellareddy Development | లింగంపల్లి వంతెనకు నిధులు మంజూరు
లింగంపల్లి వంతెన, మల్లారం చెరువు, పోల్కంపేట్ చౌదరి చెరువుల మరమ్మతులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేశారని గోకుల్ సాయిరాం చెప్పారు. వెంటనే పనులు ప్రారంభమవుతాయని రైతులు అధైర్య పడవద్దని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాజు, పీసీసీ మైనార్టీ కార్యదర్శి రఫీయొద్దీన్, నారా గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సక్రు, ప్రసాద్ గౌడ్, కుండా బాలకిషన్, సేవ్యా, ఎల్లమయ్య, రాజు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Rajiv Gandhi Tribute | యువతకు ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఘనత రాజీవ్దే : డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి


