అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dundigal POCSO Case | బాలికపై ఇద్దరు యువకులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గ్రేటర్ హైదరాబాద్ పరిధి దుండిగల్ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఓ యువకుడు బాలికను రేప్ చేయడమే కాకుండా.. తన స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడి, ఆ పాశవిక చర్యను వీడియో తీసి పలుమార్లు బాలికను బ్లాక్మెయిల్ చేశాడు.
బెదిరిపోయిన బాలిక తనపై జరిగిన దారుణ ఉదంతాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో , వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు.
Dundigal POCSO Case | డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలో..
హైదరాబాద్ – దుండిగల్ ప్రాంతంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలోని ఓ షామియానా దుకాణంలో శివకుమార్ అలియాస్ మట్టు(20) అనే యువకుడు పని చేసేవాడు. కాగా, అటువైపు నుంచి రోజూ వెళ్లే బాలికపై కన్నేశాడు.
ఒకరోజు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసిన శివకుమార్.. ఇంట్లోకి దూరి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు.
Dundigal POCSO Case | మౌనంగా ఉండటాన్ని అదునుగా చేసుకుని
బాలిక మౌనంగా ఉండటాన్ని అదునుగా చేసుకుని తన స్నేహితుడు నిజాంపేట రాము(30)తో కలిసి బాలికపై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఫొటోలు–వీడియోలు తీసి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని బెదిరించాడు.
నిందితుల వరుస వేదింపులు తాళలేక బాధిత బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన దుర్ఘటన గురించి వివరించింది.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
Telugu States Summer | పల్నాడులో 48.1 డిగ్రీలు.. బయ్యారంలో 46.20…


