అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Today | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం లాభాలతో ప్రారంభమై రోజంతా లాభాలతోనే కొనసాగింది. అయితే జియో పొలిటికల్ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరల ప్రభావంతో ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద అమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో రోజంతా ఒకే రేంజ్ లో కదలాడింది. బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ రంగాల షేర్లు రాణించడంతో ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి.
Stock Market Today | లాభాలతో ప్రారంభమై..
సెన్సెక్స్ ఉదయం 77 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 30 పాయింట్లు తగ్గింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో 580 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో ప్రారంభమె మరో 164 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం తర్వాత ప్రాఫిట్ బుకింగ్ తో లాభాలు తగ్గాయి. చివరికి సెన్సెక్స్ 234 పాయింట్ల లాభంతో 75,415 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,719 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Today | మిక్స్డ్ గా సూచీలు..
బ్యాంక్ నిఫ్టీ 1.15 శాతం, టెలికాం 0.93 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.90 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 0.63 శాతం లాభపడగా.. మీడియా ఇండెక్స్ 1.47 శాతం, ఫార్మా 1.27 శాతం, ఐటీ 0.37 శాతం, యుటిలిటీ ఇండెక్స్ 0.31 శాతం నష్టపోయాయి.
Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ ఈలో నమోదైన కంపెనీలలో 2,213 కంపెనీలు లాభపడగా 1,971 స్టాక్స్ నష్టపోయాయి. 179 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 128 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 41 కంపెనీలు 56 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 స్టాక్ లాభపడగా.. 14 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 3.01 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.52 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.77 శాతం, ఆసియన్ పెయింట్ 1.56 శాతం, హెచ్‌యూఎల్ 1.06 శాతం లాభపడ్డాయి.
Top Losers : సన్‌ఫార్మా 2.43 శాతం, ఐటీసీ 2.03 శాతం, పవర్‌గ్రిడ్ 1.75 శాతం, బీఈఎల్ 0.99 శాతం, ఎయిర్టెల్ 0.73 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Rupee Depreciation | రూపాయి విలువ తగ్గడమే మంచిది: అరవింద్ పణగరియ


