Mancherial Murder Case | మంచిర్యాలలో దారుణం.. రూ.100 కోసం హత్య

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mancherial Murder Case | మంచిర్యాల జిల్లా (Mancherial District)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.100 కోసం ఓ వ్యక్తి దంపతులపై దాడి చేశాడు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.

మంచిర్యాలలో జిల్లా దండేపల్లి మండలం (Dandepalli Mandal)లో అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. దంపతులపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన శంకరయ్య కిరాణం దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఓ వ్యక్తి దుకాణానికి వచ్చాడు. రూ.100 అప్పుగా ఇవ్వమని అడిగాడు. అయితే శంకరయ్య ఇవ్వలేదు. దీంతో ఆ వ్యక్తి గొడవకు దిగాడు.

Mancherial Murder Case

Mancherial Murder Case | కత్తితో దాడి

గొడవ పెద్దదిగా మారింది. దీంతో ఆ వ్యక్తి శంకరయ్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డం వచ్చిన శంకరయ్య భార్యపై కూడా దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. శంకరయ్య మృతి చెందాడు. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాడి చేసింది అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి..: Basaveshwara Jayanthi | బసవేశ్వర భవన్​కు శంకుస్థాపన చేస్తాం : మంత్రి పొన్నం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *