BRS Leaders Jalasoudha | బీఆర్​ఎస్​ నాయకులను అడ్డుకున్న పోలీసులు.. జలసౌధ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్​ నగరంలోని జలసౌధ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: BRS Leaders Jalasoudha | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని జలసౌధ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. బీఆర్ఎస్ నేతలకు లోపలికి అనుమతించలేదు. దీంతో హైటెన్షన్ నెలకొంది.

కేఆర్​ఎంబీ సమావేశానికి వెళ్లాలని బీఆర్​ఎస్​ నేతలు పిలుపునిచ్చారు. దీంతో పలువురు నాయకులను పోలీసులు హౌస్​ అరెస్ట్​చేశారు. కొంతమంది సమావేశానికి హాజరు కావడానికి జలసౌధకు రాగా.. అక్కడ అడ్డుకున్నారు. దీంతో వారు గేటు తెరుచుకొని లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ఉద్యోగులు, మీడియాను సైతం కొంత సేపటి వరకు లోనికి అనుమతించలేదు. అనంతరం పలువురు బీఆర్​ఎస్​ నేతల బృందాన్ని అనుమతించారు.

BRS Leaders Jalasoudha | ఆ పనులు ఆపివేయాలి

మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కేఆర్​ఎంబీ సమావేశంలో పాల్గొన్నారు. ఛైర్మన్​కు వినతిపత్రం అందించారు. జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వద్ద ఆంధ్ర ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించడానికి నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ అక్రమ నిర్మాణంపై కేఆర్ఎంబీకి, సీడబ్ల్యూసీకి, తెలంగాణ రాష్ట్రానికి సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించిందని ఆరోపించారు. ఈ పనులను వెంటనే నిలిపివేయించాలని కేఆర్ఎంబీ అధికారులను కలిసి లేఖ ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి తన వాటా కంటే ఎక్కువ నీటిని వాడుకుందన్నారు. దీంతో హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని రెండున్నర కోట్ల మంది తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Komatireddy 100 Seats | వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *