అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Uttam | కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇన్‌ఛార్జి సందీప్‌తో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ సమయంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలన్నారు. పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసిన వారికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Minister Uttam | మళ్లీ అధికారంలోకి వస్తాం
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగాలన్న లక్ష్యంతో పనిచేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వినియోగించామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అత్యధిక వ్యవసాయ విస్తీర్ణం నమోదైందన్నారు. అత్యధిక వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ కూడా తమ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పారు.
Minister Uttam | ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టిందని ఉత్తమ్ విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్‌బీసీ, డిండి తదితర ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. ఎన్నికల్లోపు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు నీరు అందించేలా కృషి చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: BRS Leaders Jalasoudha | బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు.. జలసౌధ వద్ద ఉద్రిక్తత