అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyberabad Demolitions | సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC)లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతి లేకుండా, పర్మిషన్ తీసుకున్న దానికి విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నారు.
సైబరాబాద్ పరిధిలో నిత్యం అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కూల్చివేతలు చేపడుతున్నారు. అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లలో నిత్యం కార్పొరేషన్ అధికారుల బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి.
Cyberabad Demolitions | 10 నిర్మాణాల కూల్చివేత
కార్పొరేషన్ అధికారులు గురువారం పది నిర్మాణాలను కూల్చి వేశారు. మరో 10 అనధికార నిర్మాణాలను గుర్తించారు. వాటిలో నాలుగింటికి నోటీసులు జారీ చేశారు. గుర్తింపు దశ నుండి చర్యలు తీసుకునే వరకు, CMC బృందాలు మూడు జోన్లలోనూ క్షేత్రస్థాయిలో తమ విధులను నిర్వర్తిస్తున్నాయి. అధికారులు బుధవారం 15 నిర్మాణాలను కూల్చివేశారు.
CMC Demolition Drive | Today’s Update!!
CMC teams continued field-level inspections and enforcement action across all three Zones against unauthorized constructions.
🔹 10 unauthorized constructions identified
🔹 10 demolitions carried out
🔹 4 notices servedFrom… pic.twitter.com/C4dZKkL3OD
— Cyberabad Municipal Corporation (@CMC_Offcl) October 1, 2026
దీనిని కూడా చదవండి : Nizamabad CI Transfers | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో సీఐల బదిలీలు