అక్షరటుడే వెబ్‌డెస్క్: DBS ICEGATE 2.0 | వ్యాపార , వాణిజ్య సంస్థల కోసం ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ ‘డిబిఎస్ బ్యాంక్ ఇండియా’ (DBS Bank India) కీలక ప్రకటన చేసింది. కస్టమ్స్ డ్యూటీ (Customs Duty), సెంట్రల్ ఎక్సైజ్ (Central Excise), సర్వీస్ ట్యాక్స్ (Service Tax) చెల్లింపులను ‘ఐస్గేట్ 2.0’ (ICEGATE 2.0) ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పటికే జీఎస్టీ (GST), డైరెక్ట్ ట్యాక్స్‌ల చెల్లింపు సేవలను అందిస్తున్న డిబిఎస్ బ్యాంక్.. ఇప్పుడు ఈ కొత్త సేవలను కూడా జోడించడం ద్వారా, ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రధానమైన అన్ని కేంద్ర పన్నుల (Central Tax Categories) చెల్లింపులను ఒకే చోట అందిస్తున్న భారతదేశపు ఏకైక పూర్తి యాజమాన్యంలోని అనుబంధ బ్యాంకుగా నిలిచింది.
DBS ICEGATE 2.0 | విశేషాలు..
ఒకే వేదికపై అన్ని చెల్లింపులు: వ్యాపారస్తులు తమ రోజువారీ బ్యాంకింగ్ , ట్రెజరీ అవసరాల కోసం ఉపయోగించే ‘డిబిఎస్ ఐడియల్’ (DBS IDEAL) ప్లాట్‌ఫారమ్ ద్వారానే కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ , సర్వీస్ ట్యాక్స్ చెల్లింపులను సులభంగా పూర్తి చేయవచ్చు. భారతదేశంలో ఎగుమతులు, దిగుమతులు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యాపార సంస్థలు తమ చట్టపరమైన పన్ను బాధ్యతలను ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజిటల్ పద్ధతిలో నిర్వహించుకునేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సేవలు వారాంతాలతో సహా ప్రతిరోజూ ఉదయం 4:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే డిబిఎస్ ఐడియల్ ఖాతా కలిగి ట్యాక్స్ చెల్లింపుల అర్తత ఉన్న కస్టమర్లు అదనపు డాక్యుమెంట్లు ఏవీ లేకుండానే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
DBS ICEGATE 2.0 | అంతర్జాతీయ గుర్తింపు..
డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న డిబిఎస్ సంస్థకు 2026 సంవత్సరంలో యూరోమనీ , గ్లోబల్ ఫైనాన్స్ నుంచి ‘ఆసియాస్ బెస్ట్ డిజిటల్ బ్యాంక్’, ‘బెస్ట్ బ్యాంక్ ఫర్ పేమెంట్స్’ వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. వ్యాపార ప్రక్రియల్లో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి, పారిశ్రామిక వేత్తలు తమ వ్యాపార వృద్ధిపై పూర్తి దృష్టి పెట్టేలా మెరుగైన ఆపరేషనల్ సామర్థ్యాన్ని అందించడమే తమ లక్ష్యమని డిబిఎస్ బ్యాంక్ గ్లోబల్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ హెడ్ దివ్యేష్ దలాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: ACB Raid | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్