అక్షరటుడే, ఆర్మూర్: Heavy Rain Alert | భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) సూచించారు. ఈ మేరకు ఆర్మూర్ డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Heavy Rain Alert | విపత్కర పరిస్థితుల్లో సన్నద్ధతపై..
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల సన్నద్ధత, అప్రమత్తతపై తగిన సూచనలు చేశారు. వివిధ శాఖల పరిధిలో జరుగుతున్న పనులపై స్వల్పకాలిక సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల డివిజనల్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kollur Stream Flood | పొంగిపొర్లుతున్న కొల్లూరు వాగు..